కారు.. ఇది ప్రతి ఒక్కరి కల. ఎంతోమంది సామాన్యులు కారు కొనాలని.. ఆ కారులో తన కుటుంబాన్ని తిప్పాలని ఆలోచిస్తుంటారు. అయితే.. అది అందరికి సాధ్యం కాదు. సరే.. ఇప్పుడు అది పక్కన పెడితే... ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయినా టాటా మోటార్స్ వారు తమ వినియోగదారుల కోసం వారికీ నచ్చే కొత్త కారుని తీసుకురానున్నారట. 

 

సంక్రాంతి పండుగా సందర్భంగా తమ వినియోగదారుల కోసం తీపికబురు అందించింది. సరికొత్త ఫీచర్లతో టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారును విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. వచ్చే నెల 12 నుంచి 18 నెలలలోపు టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. 

 

2021 సమయానికి ఈ కొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చేనందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే 18 నెలల్లో భారత మార్కెట్‌లో 4 ఎలక్ట్రిక్ మోడల్స్ విడుదల చేయనున్నారు. కారు బ్యాటరీ 8 ఏళ్ల వరకు వారెంటీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు 250 కిలోమీటర్ల వరుకు ఈ కారులో ప్రయాణించవచ్చు. 

 

చూశారుగా .. ఇన్ని ఆకర్షితమైన ఆఫర్లు ఉన్న ఈ కారు.. అబొవ్ మధ్య తరగతి.. పెద్దవారికి అత్యంత తక్కువ ధరలో ఈ కారు అందుబాటులోకి రానుంది. ఏమైనప్పటికి టాటా మోటార్స్ సంక్రాంతి సందర్భంగా తియ్యటి సంతోషకరమైన వార్తను చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: