మహీంద్రా అంటేనే ఓ బ్రాండ్.. అలాంటి బ్రాండ్ నుండి ఒక కారు వస్తుంది అంటే ఎదురు చూడకుండా ఉంటారా ? కచ్చితంగా చూస్తారు. అయితే అలాంటి బ్రాండ్ నుండి సరికొత్త కారు కారు వస్తుంది. మహీంద్రా బ్రాండ్ లో అప్‌డేట్ చేసిన ఎక్స్‌యూవీ 500 వెర్షన్‌ త్వరలో విడుదల కానుంది. 

 

మహీంద్రా సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేయడానికి ముందే రాబోయే ఎక్స్‌యువి 500 బిఎస్ 6 మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని లీక్ అయ్యాయి. టైప్ అప్రూవల్ సర్టిఫికేట్ ఎక్స్‌యువి 500 యొక్క W5, W7, W9, W11 ట్రిమ్‌లు నిర్ధారించబడిందని వెల్లడైంది. ఇండియన్ ఆటోస్ బ్లాగ్ ప్రకారం, మహీంద్రా ఎక్స్‌యువి 500 బిఎస్ 6 ప్రకారం వాహనం పొడవు 4,585 మిమీ, వెడల్పు 1,890 మిమీ, ఎత్తు 1,785 మిమీ కలిగి ఉంటుంది. 

 

మహీంద్రా ఎక్స్‌యూవీ 500, 2.2 లీటర్ mHawk 155 డీజిల్ ఇంజన్ ద్వారా 153 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టార్క్ గురించి సరైన వివరాలు తెలియనప్పటికీ ఇంజిన్ 360 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ కారు ధర ఎక్స్‌యూవీ 500 ధర రూ.12.31 లక్షల నుంచి రూ. 19.74 లక్షల మధ్య ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: