బజాజ్ చెతక్ ఈ పేరు ఎంత మందికి తెలుసు అంటే సుమారు 1990 దశకంలో వాళ్లకి ఈ బండి గురించి తెలుస్తుంది. ఇప్పటికీ దీని దర్జాయే వేరు అప్పట్లో ఈ బండి నడుపుతూ రోడ్లపై వెళ్తుంటే ఎంతో స్టైల్ స్టైల్ ఉండేది. ప్రస్తుతం ఈ బళ్ళు మార్కెట్ లో ఉన్నా, ఈ తరం కుర్రాళ్ళని ఆకట్టుకోవడానికి చక్కగా ముస్తాబయ్యి వస్తోంది. ఇప్పటికే ఈ బైక్ తాలూకు ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి..మరి దీని స్పెషాలిటీ ఏంటో మీరు ఓ లుక్కేయండి...

 

బాజాజ్ నుంచీ వస్తున్నా సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ అతి త్వరలో రోడ్లపై పరుగులు పెట్టనుంది. జనవరి 14 వ తేదీన ముంబై లో ఈ స్కూటర్ ని లాంచ్ చేయనుంది. మళ్ళీ 14 ఏళ్ళ తరువాత హమారా బజాజ్ అనే నినాదంతో మళ్ళీ టూవీలర్ ఇండస్ట్రీని ఊపు ఊపడానికి సిద్దమవుతోంది. ఈ సరికొత్త స్కూటర్ అదిరిపోయే లూక్స్ తో మతులు పోగొడుతోంది. ఆకట్టుకునే డిజైన్ లతో అద్భుతమైన కలర్స్ తో ఎంతో ఆకట్టుకుంటోంది ఈ బజాజ్ చెతక్. అంతేకాదు..

 

బాజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ ప్రత్యేకతన విషయానికి వస్తే డేటా కమ్యూనికేషన్, సెక్యూరిటీ , యూజర్ అదేంటికేషన్ లను కేవలం యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పటికే మార్కెట్ లో రిలీజ్ అయిన పలు కంపెనీ స్కూటర్ల కి ఇది గట్టి పోటీ అవుతుందని చెప్పడంలో సందేహం లేదని అంటున్నారు నిపుణులు. ఈ స్కూటర్ ని సుమారు 1000 మంది నిపుణులు కలిసి రూపొందించారని కంపెనీ తెలిపింది. బైక్ ఎకో మోడల్ సుమారు 95 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, మరొక మోడల్ 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు.

 

ఇక ఈ బైక్ ఫుల్ చార్జింగ్ అవ్వాలంటే సుమారు 5 నుంచీ 6 గంటల సమయంపడుతుందని అంటున్నారు. అయితే దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఆఫ్క్షన్ లేదని బ్యాటరీ మార్చుకునే వెసులుబాటు కూడా లేదని తెలుస్తోంది. అతి త్వరలో మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్న ఈ స్కూటర్ ధర సుమారు లక్ష వరకూ ఉంటుందని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: