మనం ఏదైనా ఒక వాహనం కొన్నాం అంటే దాన్ని అందంగా చెయ్యాలని అనే దురుద్దేశంతో ఆ కారుకు ఉన్న అందం సరిపోక కారు మొత్తం ప్లాస్టర్లు వేసి అతికించేస్తారు. అదేం అంటే స్టైల్ అంటారు. మా కారు స్టైల్ ఉండాలి అంటారు.. లేదా బైక్. ఇంకొంతమంది అయితే స్టిక్కర్లలో కూడా రెడ్డి అని.. చౌదరి అని.. గౌడ్స్ అని వారి క్యాస్ట్ పేరు రాపించుకుంటారు. 

 

కానీ ఇప్పుడు ఆలా కుదరదు.. ఎందుకంటే మరో కొత్త రూల్ వచ్చింది కబట్టి. అది ఏంటి అంటే? వాహనాలపై ఎలాంటి స్టికర్ వేసిన అది పెద్ద నేరం అని అంటుంది ప్రభుత్వం. వాహనాలపై స్టిక్కర్లు అతికిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం అంటున్నారు. అయితే ఈ చట్టం మన తెలుగు రాత్రాల్లో కాదు లెండి. ఉత్తరప్రదేశ్ లో ఈ నిర్ణయం ప్రస్తుతం అమలు అవుతుంది. 

 

వాహనాలపై స్టిక్కర్లు అతికించరాదు అని ఉత్తరప్రదేశ్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించిన ఓ వీడియోను ప్రముఖ మీడియా విడుదల చేసింది. అయితే ఈ వీడియోలో వాహనాలపై స్టిక్కర్లు వేసుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయిత్ వాహనంపై ఎటువంటి స్టిక్కర్ అంటే కులం పేరు, మతం పేరు, కుటుంబాల పేర్లు.. చివరికి పోలీస్, నేవి, ప్రెస్, ఆర్మీ అనే స్టిక్కర్లు వేసుకోకూడదు అని ఉత్తర్వుల్లో తెలియజేశాయి. అయితే ఈ నిర్ణయంపై కొందరు ఆనందం వ్యక్తం చేస్తే మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఇది ఇంకా తెలుగు రాష్ట్రాలలోకి రాలేదు..త్వరలోనే రావాలి అని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: