కరోనా వైరస్‌.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వణికిస్తోంది. మొదటిసారిగా చైనాలో బయటపడిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్నే భయపెడుతోంది. ఇతర దేశాల్లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వైరస్‌ సోకి ఇప్పటికే చాలా మంది చనిపోయారు. దీంతో అప్రమత్తమైన అన్ని దేశాలూ ఈ వైరస్ ను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

 

పెంపుడు జంతువులు అంటే ప్రతి ఒక్కరికి మక్కువే. కాని కరోనా వైరస్ జంతువుల నుంచి వ్యాపిస్తుందని కొందరు నమ్ముతున్నారు. దీంతో ఏంతో ప్రేమగా పెంచుకుంటున్న జంతువులను వదిలించుకునే పనిలో ఉన్నారు.మరో వైపువ్యాధి సోకిన వారి వద్దకు వెళ్లి వచ్చిన జంతువులను క్యారంటైన్ లో ఉంచాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఈ విషయం అక్కడి మీడియాలో మరో రకంగా ప్రచారం జరగడంతో ఈ వ్యాధి పెంపుడు జంతువుల వల్లే వస్తోందని అక్కడి ప్రబజలు భావిస్తున్నారు. దీంతో వాటిని వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇందులో భాగంగా ఎన్నో రోజులుగా ప్రేమతో పెంచుకుంటున్న కుక్కలు, పిల్లులను అపార్ట్‌మెంట్ల  మీద నుంచి కిందకు తోసేస్తున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచనలో అక్కడి ప్రజలు వాటి ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలా మరణించిన జంతువుల దృష్టాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని, అంతేగాని మూగజీవాల ప్రాణాలు తీయవద్దని సూచిస్తోంది. ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులతో ఈ వ్యాధి సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడి అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: