బీఎస్4 వాహనాలకు డెడ్ లైన్ మర్చి 31.. దీంతో డెడ్ లైన్ దగ్గర పడుతున్న సమయంలో ప్రముఖ వాహనాలు సంస్దలు అన్ని కూడా బీఎస్ 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా వారి టూ వీలర్స్ ను అప్డేట్ చేశారు. అయితే ఇన్నాళ్లు ఎక్కువగా 100 నుంచి 110 సీసీ ఇంజిన్లున్న వాహనాలనే వాడేవారు.. అయితే ఇప్పుడు ముఖ్యంగా 125 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన స్కూటర్లను విడుదల చేస్తున్నారు.

 

బీఎస్ 6 వాహనాలు సంస్థలు అన్ని కూడా కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగానే వారి టూ వీలర్స్ వాహనాలను అప్ డేట్ చేస్తున్నారు. అయితే 125 సీసీ ఇంజిన్ భారత మార్కెట్లో లభ్యం అవుతున్నాయి.. బీఎస్6 స్కూటర్లు అన్నింటిలో టాప్ బీఎస్6 స్కూటర్లు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

​బీఎస్6 హోండా యాక్టివా 125.. 

 

హోండా యాక్టివా 125 వాహనం గత ఏడాదే సెప్టెంబర్ నెలలో భారత్ మార్కెట్ లో విడుదల అయ్యింది.. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మితమైన ఈ స్కూటర్ 124 సీసీ ఇంజెఇ కలిగి ఉంది. అయితే ఈ బీఎస్6 హోండా యాక్టివా 125 సీసీ ధర రూ.67,490 నుండి 74,500 రూపాయల వరుకు ఉండనుంది.. ఇంకా వాహనం లీటర్ కు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. 

 

​బీఎస్6 హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125..

 

హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 125 వాహనంను ఈ ఫిబ్రవరిలో బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేశారు. ఈ బైక్ ను గతేడాదే లాంచ్ చేశారు. బీఎస్6 మ్యాస్ట్రో ఎడ్జ్ 125 ధర రూ.67,950 నుండి 70,650 మధ్య ఉంది.

 

​బీఎస్6 టీవీఎస్ ఎన్ టార్క్ 125..

 

ఈ టీవీఎస్ ఎన్ టార్క్ 125 స్కూటర్ ను ఇంకా అధికారికంగా లాంచ్ చేయలేదు.. అయితే ఈ టూ-వీలర్ కు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎక్స్ షోరూంలో బీఎస్6 టీవీఎస్ ఎన్ టార్క్ 125సీసీ ధర 65వేల నుండి 72వేల రూపాయల ఉండనున్నట్లు సమాచారం. 

 

​బీఎస్6 సుజుకీ యాక్సెస్ 125..

 

సుజుకీ యాక్సెస్ 125ను ఈ సంవత్సరం ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల చేశారు. అయితే బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ స్కూటర్ ధర రూ.64,800 నుండి రూ.69,500 మధ్య ఉంది. 

 

​బీఎస్6 యమహా ఫ్యాసినో 125..

 

ఈ యమహా ఫ్యాసినో 125 స్కూటర్ ను డిసెంబరులో బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేశారు.. అయితే ఈ వాహనం ధర రూ.66,430 నుండి 69,430 మధ్య ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: