కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా తెలంగాణాలో స్కూల్స్, కాలెజిస్ అన్ని బంద్ అయ్యాయి. షాపింగ్ మాల్స్, పబ్స్ అన్ని కూడా ఈ నెల 31వ తారీఖు వరుకు కూడా తెరవకూడదు అని ప్రకటించారు. ఇకపోతే ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. అలాంటి ఈ కరోనా వైరస్ కారులో ప్రయాణించేవారికి రాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

వాహనాల్లో కరోనా వైరస్ సోకినా వారు ఎప్పుడైనా ప్రయాణించినట్టు అయితే అలాంటి సమయంలో కరోనా వైరస్ ఎన్నో చోట్ల ఉంటుంది. స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్, డ్యాష్ బోర్డు, సీట్ బెల్ట్, డోర్ పాకెట్స్ తదితర లాంటి వాటిపై ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా శుభ్రంగా పెట్టుకోవాలి. 

 

ఆ కారులో ప్రయాణించిన సమయంలో శానిటైజర్ ఉపయోగించడం మంచిది. కనీసం 20 సెంకండ్ల పాటు ఆ శానిటైజర్ తో చేతులు కడుక్కోవాలి. 

 

గట్టిగా ఉన్న ఉపరితలాలైన స్టీరింగ్ వీల్, టచ్ స్క్రీన్, డ్యాష్ బోర్డు క్లాత్ తో శుభ్రం చెయ్యాలి. కారులోని సీట్ల ద్వారా కూడా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. సీటు తడిగా లేకుండా శుభ్రంగా తుడవాలి. లేకుంటే తేమ ఉన్న చోట క్రిములు చేరే అవకాశం ఎంతైనా ఉంది. 

 

కారు డోర్ తెరిచినప్పుడు.. ముసినప్పుడు పేపర్ టవల్స్ ను ఉపయోగించడం మంచిది. అంతేకాదు.. వాటిని వినియోగించిన వెంటనే డస్ట్ బిన్స్ లో పడేయాలి. 

 

వీలైనంత తక్కువగా క్యాబ్స్ లో ప్రయాణాలు తక్కువ చెయ్యాలి. 

 

ఒక్క కార్లలోనే కాదు.. సాధ్యం అయినంత వరుకు ప్రయాణించకపోవడం ఎంతో ఆరోగ్యకరం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

car