కరోనా వైరస్ కారణంగా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి.. ఎవరు బయటకు రాకూడదు అని ప్రకటించడంతో పనులు అన్ని ఆపేశారు.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇకపోతే ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆటో సంస్దలు కూడా లాక్ డౌన్ అయ్యాయి. అయితే అలా లాక్ డౌన్ కావడం వల్ల బీఎస్ 6 వాహనాలు అన్ని కూడా మార్కెట్లోకి ఆలస్యంగా రానున్నాయి. అయితే అలా ఆలస్యంగా వచ్చే బీఎస్ 6 బైక్స్ ఏవి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

​హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్..

 

హీరో సంస్థ ఈ బైక్ ను ఫిబ్రవరిలోనే లాంచ్ చేసింది. అయితే ఎక్స్ ట్రీమ్ 160ఆర్ మోడల్లో కొత్త తరం బైక్ గా ముందుకు వచ్చిన ఈ మోటర్ సైకిల్ ని మన భారత్ లో మర్చి విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా పడింది. 

 

బీఎస్6 బెనెల్లీ ఇంపీరియల్ 400..

 

బైక్ ఇటలీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీది. తన బెనెల్లీ సంస్ద నుండి ఇంపీరియల్ 400 మోడల్ ఈ అక్టోబరులో తీసుకురావాలని నిర్ణయించారు.. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అది మరో ఏడాది ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. మరి ఈ బైక్ ను ఎప్పుడు లాంఛ్ చేస్తారో చూడాలి. కదా ఈ బైక్ ధర రూ.1.79 లక్షలుగా ఉంది.

2020 ట్రైంఫ్ స్ట్రీట్ ఆర్ఎస్..

 

అంత బాగుంటే ఈ నెలలో విడుదల అయిపోయేది.. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ బైక్ లాంచ్ వాయిదా పడింది. ​2020 ట్రైంఫ్ స్ట్రీట్ ఆర్ఎస్ బీఎస్6 మోడల్ తో పోలిస్తే బీఎస్6 మోటార్ సైకిల్ లో కొన్ని మార్పులు చేసింది. బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా 2020 ట్రైంఫ్ స్ట్రీట్ ఆర్ఎస్ మార్పులు చేసారు. ఈ బైక్ ధర ఇంకా నిర్ణయించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: