కరోనా వైరస్.. ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలమందికిపైగా వ్యాపించింది. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా ఏకంగా 37 వేలమంది మృత్యువాత పడ్డారు.. ఇంకా రోజు రోజుకు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గటం లేదు.

 

ఇంకా ఈ నేపథ్యంలోనే మన భారత్ లోకి కరోనా వైరస్ ప్రవేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించింది. దీంతోప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఈ నెల అంత కూడా ప్రతి ఒక్కరు ఇళ్లకు పరిమితం అవ్వడం వల్ల .. లాక్ డౌన్ కారణంగా శాలరీస్ అన్ని ఇబ్బంది అవుతాయి. అంతేకాదు సామాన్యులకు నిత్యావసర వస్తువులు కొనడానికే ఇబ్బంది అవుతుంది. అలాంటిది ఇంకా ఈఎంఐలు అంటే తలకు మోసిన భారం అనే చెప్పాలి. ఇంకా ఈ నేపథ్యంలోనే మూడు నెలలపాటు వాహనాలపై ఈఎంఐలు చెల్లించాల్సిన పనిలేదని ఆర్బీఐ ప్రకటించింది. జూన్ వరకు లోన్లు కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దీంతో వాహనదారులు సంబరాలు చేసుకుంటున్నారు. 

 

అందుకే భారత రిజర్వ్ బ్యాంకు ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేందుకుగాను, మూడు నెలలపాటు వాహనాల ఈఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం మందగమనంలో సాగుతోన్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ఈ నిర్ణయంతో లక్షల మంది వాహనదారులకు ప్రయోజనం కలగనుంది. ఎంతో మంది కార్లు, బైక్స్ పై లోన్ తీసుకున్నారు. అయితే కేవలం ఒక్క ఈ నిర్ణయం వాహనదారులకు మాత్రమే కాదు ఇతర రంగాలైన వ్యవసాయం, రిటైల్ తదితర లోన్లపైనా మూడు నెలల పాటు ఉపశమనం కలిగించింది ఆర్బీఐ.  అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఈ లోన్ల గడువు కేవలం మూడు నెలల మాత్రమే.. అనంతరం యథావిధిగా తిరిగి ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: