అమెరికా దేశం వాహన తయారీ దిగ్గజం అయిన జీప్ సంస్థ తన కొత్త 7 - సీటర్ SUV ని లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. కాకపోతే ఇది 2021 సంవత్సరానికి నాటికి లాంచ్ కానుంది. జీప్ సంస్థ లాంచ్ చేయనున్న కొత్త జీప్ 7 సీటర్ గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.. ! 2021 సంవత్సరంలో లాంచ్ చేయబోయే నాలుగు కొత్త 7 సీట్ల SUV లను అమెరికన్ SUV తయారీదారు జీప్ సిద్ధం చేస్తున్నట్లు ఒక కొత్త నివేదికను విడుదల చేసింది కంపినీ. ఈ కొత్త SUV ని మార్కెట్లలో విడుదల చేయడానికి కంపెనీ ప్రయత్నం చేస్తుంది అక్కడ. అయితే ఈ బ్రాండ్ యొక్క మరొక న్యూ - జెన్ జీప్ గ్రాండ్ చెరోకీ యొక్క 7 సీట్ల మోడల్ ఇప్పటికే విదేశీ గడ్డపై పరీక్షలను చేస్తుంది.

 

 

 
ఇక కొత్తగా 7 సీట్ల జీప్ గ్రాండ్ చెరోకీ ఆల్ఫా రోమియో జార్జియో ప్లాట్‌ఫాంపై ఆధారపడి పని చేస్తుంది. ఇది 3.0 - లీటర్ ఇన్లైన్ 6  - సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుందంట. ప్లగ్ - ఇన్ హైబ్రిడ్, టర్బోడెసెల్ వేరియంట్ కూడా ఇంజిన్ లైనప్‌ లో చేరాలని ఆశిస్తున్నారు. ఏది ఏమైనా జీప్ కూడా SUV యొక్క 'ట్రైల్ రేటెడ్' వెర్షన్‌ ను కూడా సిద్ధం చేసుకుంటుంది కంపెనీ. 7 సీట్ల ఎంపికతో తర్వాతి తరం వాగోనీర్ SUV ని కూడా కంపెనీ సిద్ధం చేస్తోందని సమాచారం. ఇది ఒక యునైటెడ్ స్టేట్స్‌ లోని ఫోర్డ్ ఎక్స్‌పెడిషన్, GMC యుకాన్ వంటి వాటికి పోటీగా నిలబడుతుంది. రేంజ్ రోవర్‌ ను సవాలు చేయడానికి కంపెనీ విలాసవంతమైన గ్రాండ్ వాగోనీర్‌ ను కూడా మొదలు పెట్టింది.

 

 

 
జీప్ కంపెనీ యొక్క ఈ మోడల్ భారత్ తో పాటు బ్రెజిలియన్ మార్కెట్లో కూడా విడుదల చేయబోతుంది. భారతదేశంలో 7 సీట్ల SUV టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, VW టిగువాన్ ఆల్ స్పేస్, హోండా CR - v వంటి వాటికి ప్రత్యర్థిగా ఇది నిలబడబోతుంది. ఈ 7 సీటర్ జీప్ SUV 1.3 ఎల్ టర్బోచార్జ్డ్ మల్టీ ఎయిర్ 16 v ఇంజిన్‌ ను ఇది కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 180 BHP, 225 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 - స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ ZF - సోర్స్డ్ ఆటోమేటిక్ యూనిట్ కలిగి ఉంటుంది. అయితే ఈ SUV తో మీ కుటుంబం మొత్తం రాయల్ ప్రయాణ అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: