కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాహన సంస్థలు అన్ని తమ కార్ల విడుదలను వాయిదా వేస్తూ వస్తున్నాయి. అయితే వినియోగదారులు మాత్రం వాటి కొనుగోళ్లపై ఎక్కువ ఆసక్తి కనబర్చకపోవడం, పలు దేశాలు లాక్ డౌన్ లాంటి ఆంక్షలతో ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పడంలేదు. ఇది ఇలా ఉంటే ప్రముఖ ఆటో సంస్థ MG మోటార్స్ మాత్రం ఇందుకు భిన్నంగా తన హెక్టార్ డీజిల్ వేరియంట్ ను BS - 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో కి విడుదల చేసింది.

 

 

ఇక ఎక్స్ షోరూంలో BS - 6 ఎంజీ హెక్టార్ ధర వచ్చేసి రూ.13.88 లక్షలు గా నిర్ణయించారు. ఇప్పటికే BS - 6 హెక్టార్ పెట్రోల్ వాహనాన్ని భారత మార్కెట్ లోకి విడుదల చేసిన  MG మోటార్స్ తాజాగా డీజిల్ కారును విడుదల చేయడం విశేషమే. భారతదేశంలో తొలి ఇంటర్నెట్ కనెక్టెడ్ వాహనంగా MG హెక్టార్ ఇదివరకే గుర్తింపు తెచ్చుకుంది. ఇక BS - 6 MG హెక్టార్ డీజిల్ వాహనం ధర చుస్తే... స్టైల్ వేరియంట్ ధర రూ.13.88 లక్షలు. సూపర్ వేరియంట్ ధర రూ.14.88 లక్షలు. స్మార్ట్ వేరియంట్ ధర రూ.16.33 లక్షలు. ఇక షార్పో వేరియంట్ ధర రూ.17.73 లక్షలు. 

 

 

ఇక వీటి విశేషాల విషయానికి వస్తే... BS - 6 హెక్టార్ పెట్రోల్ వేరియంట్ మాదిరే ఇందులోనూ అన్నీ ఫీచర్లు అదే విధంగా ఉంటాయి. ఈ సరికొత్త హెక్టార్ డీజిల్ వాహనంలో 2.0 - లీటర్ FCA సోర్స్డ్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 163 BHP బ్రేక్ హార్స్ పవర్, 350 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6 - స్పీడ్ మ్యానువల్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది.  

 

 

అలాగే ఇక ఫీచర్ల విషయానికి వస్తే... BS - 6 MG హెక్టార్ ఫీచర్ల విషయానికొస్తే ఎలాంటి మార్పు ఇందులో లేవు. BS - 6 పెట్రోల్ వేరియంట్లో ఉన్న ప్రత్యేకతలు ఇందులోనూ పొందుపరిచారు. మొత్తం 4 వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ BS - 6 MG హెక్టార్ డీజిల్ వేరియంట్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రాం, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, స్పీడ్ వార్నింగ్ అలెర్ట్, డ్యూయల్ ఎయిర్ బ్యాగులు హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ లాకింగ్ బ్రేకింగ్ వ్యవస్థ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: