భారతదేశంలో చాలావరకు మధ్యతరగతి ప్రజలు జీవిస్తున్నారు అది అందరికీ తెలిసిన విషయమే. దేశంలో చాలా వరకు ద్విచక్ర వాహనం ఎక్కువగా వాడుతారు. మధ్యతరగతి రేఖకు ఎగువున ఉన్నవారు మాత్రమే కార్ల కొనుగోలుకు సుముఖత చూపుతారు. అందులోనూ ముఖ్యంగా భారత్లో కార్ల వినియోగం రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. అయితే వీరందరూ కాని కొనేముందు కారు యొక్క మైలేజీ, మెరుగైన ప్రదర్శన మొదలగు వాటిని అన్నిటిని క్షుణ్ణంగా చూసి కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అందులో కూడా ముఖ్యంగా తక్కువ బడ్జెట్ లో ఉన్న కార్లనే ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో లభించే తక్కువ బడ్జెట్ కార్లు గురించి ఇప్పుడు కొన్ని చూద్దాం.


ఇక తక్కువ బడ్జెట్లో మంచి రకమైన కార్ల విషయానికి వస్తే మారుతి కంపెనీ సుజుకి ఆల్టో, రెనాల్ట్ నుండి క్విడ్, హ్యుండాయ్ నుంచి శాంత్రో, టాటా నుంచే టియగో, మారుతి సుజుకి నుంచి వాగన్ ఆర్, మరియు  సెలేరియ... ఇలా కొన్ని కార్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక వీటి ధరల విషయానికొస్తే ఈ విధంగా ఉన్నాయి... BS - 6 మారుతీ సుజుకీ ఆల్టో 800 ధర రూ. 3.6 లక్షల - 4.39 లక్షల మధ్య ఉంది. ఇంకా BS - 6 రెనాల్ట్ క్విడ్ 0.8 Lr. ఇంజిన్ ఖరీదు రూ. 2.92 లక్షల - 4.22 లక్షల మధ్య ఉంది. BS - 6 రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ ఇంజిన్ ఖరీదు రూ. 4.42 లక్షల - 5.01 లక్షల మధ్య ఉంది.


అలాగే BS - 6 హ్యుండాయ్ శాంత్రో మోడల్ 2018 మోడల్, ఈ సరికొత్త శాంత్రో ధర వచ్చేసి రూ.4.57 లక్షల - రూ.5.98 లక్షల మధ్య ఉంది. BS - 6 టాటా టియాగో ధర రూ.4.6 లక్షల - 6.6 లక్షల మధ్య ధర ఉంది.  అలాగే 1.0 Lr. మారుతీ సుజుకీ వాగన్ ఆర్ ధర రూ.4.42 లక్షల - 5 .42 లక్షల మధ్య, 1.2 లీటర్ మారుతీ సుజుకీ వాగన్ ఆర్ ధర రూ.5.10 లక్షల - 5.91 లక్షల మధ్య ఉంది. మారుతీ సుజుకీ సెలేరియో వాహనం ధర వచ్చేసి రూ.4.41 లక్షల - 5.58 లక్షల మధ్య ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: