పల్సర్ బైక్... ఈ బైక్ కు యువతలో ఉన్న క్రేజే వేరు. అదిరిపోయే లుక్స్ తో, మంచి పికప్ తో ఉండే ఆ బైక్ పై తిరిగేందుకు యువత చాలా ఎక్కువగా ఉత్సహత చూపిస్తారు. ప్రస్తుతం BS - 6 ప్రమాణాలకు అనుగుణంగా తన వాహనాలను మార్పులు చేస్తోన్న బజాజ్ ఇప్పటికే తన పల్సర్ బైక్ మోడళ్లను చాలా వరకు ఈ నూతన ఫార్మాట్లో అప్డేట్ చేసింది తాజాగా. అయితే ఇప్పుడు బజాజ్ సంస్థ తన పల్సర్ 125 మోటార్ సైకిల్ ను BS - 6 లో మార్పులు చేసి భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. 

 


ఇక ధర విషయానికి వస్తే ఎక్స్ షోరూంలో ఈ బైక్ ప్రారంభ ధర రూ.69,997. ఇక వేరియంట్ల వారీగా పల్సర్ 125 ధర.. BS - 6 బజాజా పల్సర్ 125 ప్రారంభ ధర రూ.69,997 అవ్వగా, రెండు వేరియంట్లలో లభ్యమవుతోన్న ఈ వాహనం వేరియంట్ల వారీగా ధరలో కాస్త వ్యత్యాసముంచింది.ఇందులో డ్రమ్ వేరియంట్ ధర రూ.69,997 కాగా, అయితే ఇది పాత BS -  4 మోడల్ తో పోలిస్తే రూ.6,300 ధర ఎక్కువగా ఉంది. ఇంకా మరో మోడల్ డిస్క్ వేరియంట్ ధర రూ.74,118 అవ్వగా BS - 4 మోడల్ తో పోలిస్తే రూ.7,500 ధర ఎక్కువగా ఉంది.

 

 

ఇక ఇంజిన్ విషయానికి వస్తే.,.. BS - 6 ఫార్మాట్లో అనుగుణంగా మార్పులు చేసిన బజాజ్ పల్సర్ 125 మోడల్ 124 cc సింగిల్ సిలీండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ను ఇది కలిగి ఉంది. అలాగే 12 BHP బ్రేక్ హార్స్ పవర్, 11 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. BS - 4 మోడల్ కూడా ఇదే పవర్ ఔట్ పుట్ అభివృద్ధి చేయడం విశేషం. ఇందులో అంతేకాకుండా 5 - స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: