ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా చాలా దేశాలు లాక్ డౌన్ విధానాన్ని పాటించాయి. దీనితో చాలా రంగాలు గట్టిగా దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. అందులో కొన్ని చూస్తే ఆటో రంగం, క్రీడారంగం, రవాణా వ్యవస్థ ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక రంగాల ప్రగతి కుంటు పడిందని చెప్పవచ్చు. దీనితో అనేక మంది రోడ్డు పాలయ్యారని స్పష్టంగా అర్థం అవుతోంది. చాలా రంగాల్లో పరిశ్రమల్లో వారి కార్మికులకు జీతభత్యాలు అందక పోవడంతో చాలామంది వీధిన పడ్డారు.

 


ఇక ఆటో రంగం విషయానికొస్తే... ఈ లాక్ డౌన్ దెబ్బకి అన్ని కంపెనీలు వారి ఉత్పత్తులను ఆపి వేయడం జరిగింది. దీనికి కారణం బయట మార్కెట్ లేకపోవడమే. దీని పరిస్థితి ఇంతకు దిగజారింది అంటే...భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి తన ఆధిపత్యాన్ని చూపిస్తున్న మారుతి సంస్థ ఏప్రిల్ నెలలో మాత్రమే కాకుండా తన చరిత్రలో ఒక్క కారు కూడా అమ్మ లేదు. దీన్ని బట్టి చూస్తే ఆటో రంగం యొక్క పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే కళ్ళకు అర్థమవుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మారుతి సుజుకి సంస్థ తన ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తులను పూర్తిగా ఆపేసింది. ఫ్యాక్టరీలు షో రూమ్ లో అన్ని మూసి వేయడంతో పాటు జనం కూడా ఇంటివద్దనే ఉండడంతో కార్ల అమ్మకం జరగలేదని మారుతి చెప్పుకొచ్చింది.

 

 

అయితే దేశంలో అత్యధిక కార్లు అమ్మే రికార్డుకు మారుతి సంస్థ పెట్టింది పేరు. కాకపోతే ఈ లాక్ డౌన్ ప్రభావం ఆ కంపెనీ మీద బాగా కనపడింది. అంతకు ముందు నెల మార్చి నెలలో కూడా 47.4 శాతం అమ్మకాలు పడిపోయినట్లు సంస్థ నివేదికలో తెలిపింది. మామూలుగా సుజుకి సంస్థ ప్రతి నెలా సుమారు లక్షా 50 వేల కార్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఏప్రిల్ నెలలో కేవలం ముంద్రా పోర్టు నుంచి 632 కార్లను మాత్రమే ఎగుమతి చేసినట్లు ఆ కంపెనీ తెలిపింది. అయితే గత నెల చివరిలో హర్యానా రాష్ట్రంలో ఒక ప్లాంట్ ను ఓపెన్ చేసేందుకు మారుతి సంస్థకి ప్రభుత్వం అనుమతినిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: