కరోనా వైరస్ దెబ్బకు ప్రజలను వణికించడమే కాకుండా ప్రపంచంలోని వ్యాపార వ్యాణిజ్యాలను అస్తవ్యస్తం చేసింది. అందులో ముఖ్యంగా ఆటో రంగం విషయానికి వస్తే.. విక్రయాలు లేక.. తీవ్రనష్టాలను ఎదుర్కుంటోంది ఆ రంగం. నిజానికి చాలామంది ఇంట్లో ఉండడంతో అందరూ వాహనాలను కూడా ఉపయోగించకుండా ఇళ్లకే పరిమితమయ్యాయి. కాకపోతే వినియోగించినా, వినియోగించక పోయిన ప్రీమియం మాత్రం తప్పనిసరిగా కట్టాలి. 

 


ఇక ఈ నేపథ్యంలో బజాజా అలియంజ్ ఒక సరికొత్త పాలసీని వాహనాదారుల ముందుకు తెచ్చింది. అయితే ఇందులో కారును ఎంత వాడితే అంత మాత్రం ప్రీమియం చెల్లించేలా ఆఫర్ ను తీసుకొచ్చింది. అది ఎలా అంటే కిలోమీటర్ల చొప్పున తక్కువ కాలపరిమితిగాను ఈ సదుపాయాన్ని కంపెనీ తీసుకొచ్చింది. మాములుగా ఇది ఏడాది కాలానికి ప్రీమియం కట్టాల్సి ఉండగా.. ఇప్పుడు దీని స్థానంలో ఈ సరికొత్త పాలసీని కంపెనీ తెచ్చింది.

 

 

అయితే దేశంలోని వాహనాల యజమానులు ఈ బీమాను ఎంచుకున్నట్లయితే, కేవలం ప్రీమియం వాహనాల ప్రయాణించిన దూరం.. అంటే కిలోమీటర్ల చొప్పున లెక్క వేస్తారు. ఇక అది కూడా నిర్ణీత కిలోమీటర్ల వరకే అది అందుబాటులో ఉంటుంది. ఈ పాలసీలో ఎంచుకున్న కిలోమీటర్లు అయిపోతే దీన్ని మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాలి. కాబట్టి ఈ పాలసీలో కిలోమీటర్లు అయిపోయిన  ప్రతి సారి టాప్ అప్స్ చెల్లిస్తూనే ఉండాలి. కాకపోతే, ఈ విధంగా రెగ్యూలర్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటే మొత్తం ఏడాదికి అందుబాటులో ఉండే సంవత్సరం కారు ఇన్సురెన్స్ పాలసీని తీసుకోవడమే మంచిది అని చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటివి కొంత మేరకు వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే లాక్ డౌన్ నిరంతాయంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ వాహనాలు బయట తిరగడం చాలా తక్కువ అయ్యింది. అయితే ఇది అందరికి కాకపోయినా కొద్దీ మందికి ఇది ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: