ప్రస్తుతం భారత దేశంలో కార్ల వినియోగం ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. ఏదైనా సెలవు దొరుకుతే లేదా, చిన్న దూరాలకు అయినా సరే కార్ ను ఉపయోగించడం మధ్య తరగతి ప్రజల నుండి అలాగే ధనికుల వరకు కారులోనే ప్రయాణించడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. అయితే దీనికోసం వినియోగదారుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఆటో కంపెనీలు చిన్న చిన్న కార్లను తయారు చేయడంలో ముందుకు వస్తున్నాయి. అంటే మధ్యతరగతి ప్రజలకు కార్లను కొనేందుకు అందుబాటులో ఉండే విధంగా 5 లక్షలకు దగ్గరలో కొత్త రకాల మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

IHG


ఇక హ్యుండాయ్, టాటా కంపెనీ, మారుతి కంపెనీలు ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నాయి. మామూలుగా కంపెనీలు సామాన్యులు తనకే కార్లను రిలీజ్ చేయడం ద్వారా ఉత్తరాలు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మార్కెట్లో చాలా రకాలైన మోడల్ కార్లు ఐదు లక్షల రేంజ్ లో మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇకముందు కూడా ఈ ధరలో కొత్త కార్లు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో కొన్ని ఈ సంవత్సరం రాబోతుండగా మరికొన్ని మాత్రం వచ్చే సంవత్సరం మాత్రమే రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇప్పుడు మనము ఐదు లక్షల కంటే తక్కువ కాస్ట్ లో భారత మార్కెట్లో విడుదల కాబోతున్న అత్యుత్తమ వాహనాలు ఏమిటో ఒకసారి చూద్దామా....!

 

IHG
​డాట్సన్ రెడీ-గో ఫేస్ లిఫ్ట్, ​టాటా హెచ్ బీఎక్స్, మారుతీ సెలేరియో, ​హ్యుండాయ్ మైక్రో ఎస్ యూవీ (హ్యుండాయ్ ఏఎక్స్), హ్యుండాయ్ శాంత్రో ఫేస్ లిఫ్ట్ ఇలా కొన్ని కార్లు తక్కువ ధరలలో మార్కెట్ లో రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి, ఎవరైనా కార్ కొనాలని ఆలోచిస్తున్నారా అయితే కొద్దిగా ఈ కొత్త కార్ల గురించి తెలుసుకొని కొనండి.

మరింత సమాచారం తెలుసుకోండి: