BS 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి టొయోటా ఇండియా భారత మార్కెట్లో సరికొత్త వాహనాలను విడుదల చేయబోతుంది. ఇక తాజాగా ఈ వాహన సంస్థ తన BS 6 కామ్రీ మోడల్ ను భారత విపణిలోకి విడుదల చేసింది. ఇకపోతే షోరూంలో BS 6 టొయోటా కామ్రీ మోడల్ ప్రారంభ ధర రూ.37.38 లక్షలు. ఇదే కార్ బీఎస్4 మోడల్ తో పోలిస్తే ఏకంగా 93 వేల రూపాయలు అధికంగా కనపడుతోంది. BS 4 టొయోటా కామ్రీ ధర రూ.36.95 లక్షలు గా ఉంది.

IHG


ఇక ఇంజిన్ విషయానికి వస్తే ... ఈ 2020 టొయోటా కామ్రీ మోడల్ 2.5 - lr  హైబ్రిడ్ పవర్టెయిన్ ను ఇది కలిగి ఉంది. ఈ పెట్రోల్ ఇంజిన్ 176 BHP  బ్రేక్ హార్స్ పవర్, 221 nm  టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక అంతేకాకుండా ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ కూడా కలిగి ఉంది. ఇది 118 BHP బ్రేక్ హార్స్ పవర్, 202 nm  టార్క్ ను ఉత్పిత్తి చేస్తుంది. అంతేకాకుండా స్థిరమైన ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. దీనితోపాటు ట్రెడిషనల్ ఇంటర్నెట్ కంబషన్ ఇంజిన్ కూడా ఇందులో మనకు లభిస్తుంది.

 

 

ఇక దీని కొన్ని ప్రత్యేకతలు చూస్తే ... BS 6 టొయోటా కామ్రీ మోడల్ ఫీచర్ల దగ్గరకొస్తే.. అతిపెద్ద టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టంను ఇది కలిగి ఉంది. అంతేకాకుండా JBL ఆడియో వ్యవస్థను కూడా కలిగి ఉంది.  ఇక అనేక ప్రత్యేకతలతో పాటు 9 ఎయిర్ బ్యాగులు, ABS విత్ ఈబీడీ, పార్కింగ్ సెన్సార్లు, రేర్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఫంక్షన్ తదితర భద్రతా పరమైన ప్రత్యేకతలు ఈ కార్ ప్రత్యేకతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: