దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన  హ్యుండాయ్ తమ ఎలంట్రా సెడాన్ యొక్క బేస్ -స్పెక్ 'ఎస్' వేరియంట్‌ను భారత మార్కెట్లో నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ లో హ్యుండాయ్ ఎలంట్రా ఎస్ ధర రూ. 15.89 లక్షలు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో  హ్యుండాయ్ ఎలంట్రా ప్రారంభ ధర చాలా పెరిగింది. హ్యుండాయ్ ఎలంట్రా 'SX' ఇప్పుడు లైనప్‌ లో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా 'ఎస్' స్థానంలో వచ్చింది. అయితే ఈ కొత్త బేస్ వేరియంట్ మునుపటి మోడల్ కంటే ఏకంగా 3 లక్షల రూపాయలు ఖరీదైనది. ఇప్పుడు దీని ధర ఢిల్లీ ఎక్స్-షోరూమ్ లో రూ. 18.49 లక్షలు.

 

 

అయితే వేరియంట్ నిలిపివేయడానికి ఖచ్చితమైన కారణం గురించి హ్యుండాయ్ కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇకపోతే ఈ కొత్త మార్పులను ప్రతిబింబించేలా కంపెనీ వెబ్‌ సైట్ మాత్రం అప్డేట్ చేసింది. హ్యుండాయ్ ఎలంట్రా ఇటీవల భారత మార్కెట్ లో BS 6 నియమ నిబంధనలకు అనుగుణంగా నవీనీకరించబడింది. కొత్త BS 6 కంప్లైంట్ సెడాన్ 2.0 lr పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ను ఇది కలిగి ఉంటుంది.

 


ఇక ఈ హ్యుండాయ్ కారులో 2.0 lr పెట్రోల్ ఇంజన్ 150 BHP, 192 nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 lr డీజిల్ ఇంజన్ అదే 115 bhp, 250 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 6 - స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ ‌బాక్స్‌ తో ఈ కార్ జతచేయబడి ఉంటుంది. తాజా హ్యుండాయ్ ఎలంట్రా ఇప్పుడు మూడు వేరియంట్ల ఎంపికలో దొరకనుంది. అవి SX ఎంటి, SX ఏటి, SX (O) ఏటి. 

మరింత సమాచారం తెలుసుకోండి: