కరోనా సంక్షోభ పరిస్థితుల్లో వినియోగదార్లను ఆకర్షించి తమ కంపెనీ అమ్మకాలను పెంచుకోడానికి మహీంద్రా అండ్‌ మహీంద్రా ఒక వినూత్న రుణ పథకాలను ఆవిష్కరించింది. దీనికోసం కొత్తగా వైద్యులు, పోలీసులు, సరకు రవాణా వాహనాల యజమానులకు విడివిడిగా కొన్ని, సాధారణ వినియోగదార్ల కోసం మరిన్ని కొత్త రుణ పథకాలను రూపొందించింది కంపెనీ యాజమాన్యం. ఇక ఇందులో వైద్యులు ఏదైనా మహీంద్రా వాహనం కొనుగోలు చేస్తే వారికి ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండానే వారు కోరినంత రుణం మంజూరు చేస్తుందట. ఇకపోతే ఇప్పుడు ఈ వాహనాన్ని తీసుకుని మూడు నెలల తర్వాత సొమ్ము చెల్లించవచ్చు కూడా. దీనికరణం అంటే 90 రోజుల 'మారటోరియం' లభిస్తుంది కాబట్టి.

 


ఇకపోతే అలాగే  సాధారణ వినియోగదార్లు ఎవరైనా మహీంద్రా SUV కొనుగోలు చేసి, వచ్చే ఏడాది నుంచి EMI చెల్లించే అవకాశం కలిపించింది సంస్థ. ఇక ఈ మహీంద్రా SUV లపై నూరు శాతం 'ఆన్‌-రోడ్‌ ఫండింగ్‌' కూడా లభిస్తుంది. అంతేకాకుండా మహిళలు కొనుగోలు చేసే వాహనాలకు 0.1 శాతం తక్కువ వడ్డీ రేటుకే రుణం అందిస్తున్నాయి. ఇక మూడు నెలల వరకు తక్కువ EMI కడుతూ, ఆ తర్వాత EMI మొత్తాన్ని పెంచుకునే సదుపాయం కూడా వారికి అందిస్తోంది. అయితే ఇందులో గరిష్ఠంగా 8 సంవత్సరాల కాలానికి రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు మహీంద్రా కంపెనీ వెల్లడించింది.

 


ఇకపోతే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఆటోమొబైల్ రంగం పూర్తిగా దెబ్బతింది. దీనికి కారణం ఉత్పత్తి చేసే కేంద్రాలను మూసి వేయడం, అలాగే షోరూంలు తెరవడంతో ఆటోమొబైల్ రంగాలు నష్టాల ఊబిలోకి వెళ్ళాయి. ఏదిఏమైనా ప్రజలను తమ కంపెనీ వైపుకు తిప్పుకొనేందుకు అనేక కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి ఇది కూడా అందులో ఒక భాగమే.

మరింత సమాచారం తెలుసుకోండి: