ఎన్ని రోజుల నుంచి వేచి చూస్తున్న స్కోడా వాహన సంస్థ తన కరోఖ్ మోడల్ ను భారత విపణిలోకి విడుదల చేసింది. ఈ కారు గత నెలలోనే మార్కెట్లోకి రావాల్సి ఉండగా, కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కంపెనీ తాత్కాలికంగా వాయిదా వేసి తాజాగా ఇప్పుడు మరోసారి విడుదల చేసింది స్కోడా. ఇక ఈ కారు భారత మార్కెట్లో SUV మోడల్ లో ప్రారంభ ధర వచ్చేసరికి రూ. 24.99 లక్షలుగా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ ఒక్క వేరియంట్ ను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది కంపెనీ.

IHG


ఈ వాహనం డిజైన్ విషయం కొస్తే... కొడియక్ మోడల్ నుంచి దీన్ని రూపొందించారు. నిజానికి అదే టైప్ డిజైన్ ఇందులోకి తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఇందులో చెప్పుకోవాల్సినవి బటర్ ఫ్లై గ్రిల్ తో ఈ వాహనంలో ఎల్ఈడి హెడ్ లాంప్, సి ఆకారంలో ఉండే ఎల్ఈడి టెయిల్ లైట్స్ మరికొన్ని ప్రత్యేకతలతో వీటిని భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇక ఈ కారు యొక్క ఇంజన్ మరియు మైలేజ్ విషయం చూస్తే... ఇందులో 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ ను ఇది కలిగి ఉంది. 


ఇందులో 150 BHP బ్రేక్ హార్స్ పవర్, 250 NM విడుదల చేసే టార్క్ ఇది కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో 7 స్పీడ్ డి ఎస్ జి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో ఈ కార్ పనిచేస్తుంది. ఈ కారు కేవలం 9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు గరిష్టంగా గంటకు 202 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతోంది. WLTP రేటింగ్ ఉన్న ఈ కారు మైలేజ్ ఈ వచ్చేసి లీడర్ గరిష్టంగా 14.5 కిలోమీటర్లు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: