భారతదేశంలో చాలా మంది మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఆటోమొబైల్ రంగ సంస్థలు వారి కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అతి తక్కువ కాస్ట్ లో మంచి కార్ కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. దీనికి అనుగుణంగా ప్రస్తుతం భారత మార్కెట్లో ఒక కారు విడుదలైంది. డాట్సన్ ఇండియా తన సరికొత్త కార్ డాట్సన్ రెడీ గో ఫేస్ లిఫ్ట్ ను భారత విపణిలోకి లాంచ్ చేసింది. అయితే ఈ సరికొత్త బిఎస్  6 రూల్స్ కు అనుగుణంగా రూపొందించిన ఈ కారు ప్రారంభ ధర రూ. 2.83 లక్షలు. ఇక అలాగే ఇందులో టాప్ వేరియంట్ ధర రూ 4.7 లక్షలు. కారు మొత్తంగా ఆరు వేరియంట్స్ ఇందులో లభ్యమవుతుంది. వీటి ధర కూడా వ్యత్యాసం ఉంది. ఏ కారు ఎంత చూద్దామా ఒకసారి... రెడీ గో డీ రూ.2.83 లక్షలు, ఏ వేరియంట్ రూ.3.58 లక్షలు, టీ వేరియంట్ రూ.3.8 లక్షలు, టీ(ఓ)-0.8ఎల్ రూ.4.16 లక్షలు, టీ(ఓ)-1.0ఎల్ రూ.4.44 లక్షలు, టీ(ఓ)-1.0ఎల్ ఏఎంటీ రూ.4.77 లక్షలు గా ఈ కార్స్ ధరలు ఉన్నాయి. 

IHG


ఇక ఈ కార్ ఇంజన్ విషయానికి వస్తే 800cc పెట్రోల్ ఇంజన్ లను ఈ కారు కలిగి ఉంది. అదే 999 cc సిలిండర్ ఇంజన్ అయితే దీనిని కొత్తగా bs6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇక అంతే కాకుండా ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో ఈ కార్ పని చేయనుంది. ఇక ఈ కార్ డిజైన్ సంగతికి వస్తే ఇంజన్ అప్డేట్ కాకుండా డాట్ సన్ రెడీ గో ఫేస్ లిఫ్ట్ ఆక్టాగోనాల్ గ్రిల్, ఫ్లాంకెడ్ హెడ్ ల్యాంపులు కలిగివుంది. ఇక ఈ కారు టోన్ డాష్ బోర్డు నలుపురంగు, గన్ మెటల్ గ్రే రంగులలో ఈ కార్ లభిస్తుంది. కాకుండా ఈ కారులో సరికొత్తగా అనేక రకాల ఫీచర్స్ ను ఇందులో పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: