దేశంలో చాలా వరకు ప్రయాణం చేయడానికి ఉపయోగించే వాహనం మోటర్ బైక్. భారతదేశంలో చాలావరకు మధ్యతరగతి కుటుంబాలు ఉండడంతో ఎక్కువగా మోటర్ బైక్ కొనడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త మధ్య తరగతి వారు కూడా లోన్ తీసుకొని మరి లోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తక్కువ ధరలో బైక్ కొనుగోలు చేయాలని అందరూ అనుకుంటారు. అంతేకాకుండా అన్ని విషయాలు సరిగా ఉండే విధంగా ఎంచుకొని కొనుగోలు చేయడం జరుగుతుంది.


ఇక తాజాగా భారత మార్కెట్లో కాస్త తక్కువ ధరలో ఉండే బైక్ రిలీజ్ అయింది. అది హోండా కంపెనీ వారి సీడీ 110 డ్రీం. BS - 6 కాలుష్య నియంత్రణకు అనుగుణంగా మార్పులు చేసిన తర్వాత ఈ మోటార్ సైకిల్ సరికొత్త అప్డేట్ లతో అందుబాటులోకి వచ్చింది. ఇక BS - 6 హోండా cd 110 మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ 62729 గా ఒక కంపెనీ నిర్ధారణ చేసింది.


బైక్ ను BS - 4 తో పోలిస్తే ఏకంగా 12 వేల రూపాయలను పెంచింది హోండా సంస్థ. ఈ బైక్ మొత్తం రెండు వేరియంట్స్ లలో లభ్యమవుతుంది. ఇకపోతే ఈ రెండిట్లో వేర్వేరు ఫీచర్స్, ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే... హోండా సీడీ 110 డ్రీమ్ బైక్ 110 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలీండర్ ఇంజిన్ కలిగి ఉంది. అయితే ఇంజిన్ కు సంబంధించిన వివరాలు ఇంకా కంపెనీ పూర్తిగా తెలపలేదు. ఈ విషయంలో ఇది వరకు ఉండే బైక్ మోడల్ మాదిరే ఉండబోతున్నటు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యూయల్ ఎఫిషియంట్ కాస్త మెరుగుపడుతుంది. కొత్తగా ఇందులో సైలెంట్ స్టార్ట్ ఫీచర్ ని అమర్చడం జరిగింది. ఇక భారత మార్కెట్లో హోండా సీడీ110 డ్రీం మోటార్ సైకిల్ కు పోటీగా హీరో స్పెండర్ i3s, టీవీఎస్ రేడియం మోటార్ సైకిల్స్ గట్టిపోటీని ఇవ్వబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: