కరోనా వైరస్ పుణ్యమా అని దేశంలో రోజురోజుకీ వ్యాపార సంస్థలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇకపోతే కరోనా కారణంగా ఆటోమొబైల్ రంగ సంస్థ ఎన్ని ఇబ్బందులు పడిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే తాజాగా సడలింపులు కారణంగా కాస్త ఆటోమొబైల్ రంగానికి ఊరట లభిస్తోంది.  ఇకపోతే తాజాగా అకోడ్రైవ్ అని వర్చువల్ కార్ డీలర్ షిప్ భారతదేశంలో నడుస్తోంది. కరోనా నేపథ్యంలో కార్ల సంస్థలన్నీ ఆన్లైన్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. ఇకపోతే ఆయా సంస్థలు ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా తన వినియోగదారులకు అనేక రకాల సౌకర్యాలను అందజేస్తున్నాయి.

IHG


ఇక అందులో కంపెనీ హోమ్ డెలివరీ, షెడ్యూల్ డెలివరీ, సరసమైన లావాదేవీలు వంటి అనేక రకాల ఎంపికలను కస్టమర్లకు అందించబోతున్నారు. ఇకపోతే ఈ విషయాన్ని అకోడ్రైవ్ సంస్థ అధినేత సాగర్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారుల మనస్తత్వం ఆలోచించి కొత్త మార్పు తీసుకువచ్చామని ఆయన తెలిపారు. ప్రజలు వారి సొంత కార్ కలిగి ఉండాలని అనేకమంది అనుకునే వారు ఉంటారు. ప్రస్తుత కాలంలో ఆ కారును కొనడమే కాకుండా సురక్షితంగా ఉపయోగించాలని వారు అనుకుంటున్నారు. దీనితో మేము ఆన్లైన్ విధానం ద్వారా సురక్షితంగా కొనుగోళ్లను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

IHG


ఇకపోతే మా దగ్గర కార్ల కొనుగోలు, అమ్మకం యొక్క పూర్తి వివరాల ప్రక్రియ కస్టమర్ గోప్యత, నిశ్చయత పై కేంద్రీకృతమై ఉంటుంది అని అకోడ్రైవ్ కారు కొన్న వినియోగదారులు పూర్తిగా సంతృప్తి పడతారని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా వారి దగ్గర అతి తక్కువ ధరకు అలాగే ఫైనాన్స్ సదుపాయం కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: