దేశంలోని యువత చాలామంది స్పోర్ట్స్ బైక్ ను ఇష్టపడుతుంటారు. అలా ఇష్టపడని వారు ఉండరు అంటే ఆశ్చర్యమే . మంచి నేషనల్ హైవే రోడ్ల పై తన బైక్ తో రయ్... రయ్... మంటూ దూసుకుపోవాలి అనుకునేవారికి ఈ స్పోర్ట్స్ బైక్స్ ఎంతగానో ఉపకరిస్తాయి. ఇకపోతే తాజాగా ప్రముఖ మోటార్ సైకిల్ సంస్థ అయిన ట్రైంఫ్ తన సరికొత్త టీ - 120 , టీ - 100 మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇకపోతే ఇందుకు సంబంధించి కేవలం బ్లాక్ ఎడిషన్ వర్షన్ లో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక వీటి ధర విషయానికి వస్తే... ఎక్స్ షోరూమ్ లో టీ - 100 బ్లాక్ ఎడిషన్ దాదాపుగా రూ 8.87 లక్షలుగా ఉంది. ఇక అలాగే మరోవైపు బైక్ ట్రైంఫ్ టీ - 120 బ్లాక్ ఎడిషన్ వచ్చేసరికి రూట్ 9.97 లక్షలగా ఉంది.

 

IHG

 

ఇక దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఈ రెండు మోటర్ బైకులు కూడా పూర్తిగా నలుపురంగులో నుండి కాస్మెటిక్ అప్డేట్ లతో అందుబాటులోకి తీసుకువచ్చింది సదరు కంపెనీ. దీనిలో అధునాతన ఫీచర్లను ఏర్పాటు చేసింది ఈ సంస్థ. ఈ రెండు మోటార్ సైకిల్ స్టాండెడ్ ఎల్ఈడి హెడ్ల్యాంప్స్, ఛానల్ ఏబిఎస్ ట్రాన్సక్షన్ కంట్రోల్, మల్టిపుల్ రైడింగ్ లాంటి మొదలగు తదితర ఫీచర్లతో సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది.

IHG


ఇక ఈ బైక్ కు సంబంధించిన ఇంజన్ విషయానికొస్తే సాంకేతికంగా చూస్తే ఈ బైకులో పెద్దగా మార్పులేమీ లేవు. ట్రైంఫ్ బోనేవిల్లీ టీ 100 బ్లాక్ ఎడిషన్ లో 900 cc ఇంజన్ ను ఈ బైక్ కలిగి ఉంది. ఇక అలాగే ట్రైంఫ్ బోనేవిల్లీ టీ 120 బ్లాక్ ఎడిషన్ మోటార్ సైకిల్ 1200cc ఈ బైక్ కలిగి ఉంది. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థ అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: