సాధారణంగా భారతదేశంలో కారు కొనుగోలు చేస్తున్నారంటే వారిని ఓ మోస్తారు ఎగువ మధ్యతరగతి కుటుంబం అని ఇట్టే చెప్పవచ్చు. అలాంటివి లగ్జరీ కారు కొంటున్నారంటే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని కేవలం ధనికులు మాత్రమే ఉంటారని అందరికీ తెలిసిన సత్యమే. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి మొదలగు అలాంటి కార్లను కొనుగోలు చేయాలంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి.

IHG

 


ఇకపోతే ఈ మధ్యకాలంలో వీటిలో తిరగడం అంటే చాలా పరువుగా, వ్యక్తిత్వాన్ని సంకేతంగా భావించే వారు ఎక్కువయ్యారు. మరి ఈ కార్లు ఇంత ధర పలకడానికి కారణం వాటిలో ఉండే సరికొత్త టెక్నాలజీ, డిజైన్ మొదలగు అత్యాధునిక ఫీచర్లు వంటివి ఈ వాహనాల్లో లభిస్తాయి కాబట్టి వాటికి అంత ధర చెల్లించాల్సిందే మరి. ఈమధ్య కొన్ని కంపెనీలు అందుబాటు ధరలోకి వచ్చే లగ్జరీ కార్లను భారత మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. అవి కూడా ఆడి లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల వాహనాలు అంటే మీరు నమ్మగలరా....? అవును మీరు విన్నది నిజమే...! ఆడి లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలో కొన్ని వాహనాలు అందుబాటు ధరలో ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యమే. ఇకపోతే ఆ కార్లు ఏమిటో, వాటి ధరలు ఏంటో ఒకసారి చూద్దామా....!

IHG


ఆడీ ఏ3 భారత మార్కెట్లో దీని ధర వచ్చేసి రూ.29.2 - రూ.32.21 లక్షల మధ్య ఉంది. ఆడీ క్యూ3 వచ్చేసరికి SUV ధర వచ్చేసి రూ.34.96 - రూ.43.61 లక్షల మధ్య ఉంది. ఆడీ ఏ4 వాహనం ఖరీదు వచ్చేసి 41.96 - రూ.46.96 లక్షల మధ్య ఉంది. ఆడీ ఏ6 కారు ధర వచ్చేసి రూ.54.42 - 59.92 లక్షల మధ్య ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: