విభిన్నమైన వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేస్తూ.. అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న సంస్థ హోండా. తాజాగా ఈ వాహన సంస్థ తన సివిక్ డీజిల్ మోడల్ ను బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేసిందని తెలిపారు. ఎక్స్ షోరూంలో ఈ 2020 హోండా సివిక్ డీజిల్ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.20.72 లక్షలుగా సంస్థ నిర్దేశించిందని కంపెనీ యాజమాన్యం తెలియజేశారు. అయితే ఈ కారు అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.

 

 

ఈ సరికొత్త హోండా సివిక్ మోడల్ రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. వీఎక్స్, జెడ్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. వీఎక్స్ వేరియంట్ ధర రూ.20.72 లక్షలు. జెడ్ఎక్స్ వేరియంట్ ధర రూ.22.34 లక్షలు ఉంటుందని సంస్థ యాజమాన్యం తెలిపారు.

 

 

బీఎస్ 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ 1.5 లీటర్ డీజిల్, 1.2 పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉండి దాదాపు బీఎస్4 మోడల్ మాదిరే ఉండే అవకాశముంది. ప్రస్తుతమున్న మోడల్లోని డీజిల్ ఇంజిన్ 100 పీఎస్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే పెట్రోల్ వాహనమైతే 90 పీఎస్ పవర్, 110 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా పెట్రోల్ ఇంజిన్ 5- స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుండగా.. డీజిల్ వాహనం 6-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది.

 

 

హోండా సంస్థ. 1.8-లీటర్ ఐ-వీటీఈసీ సాంకేతికత, సీవీటీ ట్రాన్స్ మిషన్ యూనిట్ కూడా ఉంది. వీటితో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అతిపెద్ద టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయని యాజమాన్యం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: