భారత్ లో అత్యధికంగా కస్టమైజ్ చేయబడే మోటార్‌ సైకిల్స్ లో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్లు తరచూ తమ మోటార్‌సైకిళ్లను వారి వ్యక్తిత్వానికి అనుగుణంగా కొన్ని కస్టమైజ్ మార్పులతో  చేయించుకుంటడాన్ని మనం చూస్తూనే ఉంటాం. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మోడిఫికేషన్ కోసం కస్టమర్లు థర్డ్ పార్టీ కంపెనీలకు వెళ్తుంటారు. ఈ మార్కెట్ ధోరణిని పసిగట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఇకపై తమ మోటార్ ‌సైకిళ్లకు వారే స్వయంగా కస్టమైజేషన్ ఆప్షన్లను అందించేందుకు సిద్ధమైంది. ఇందులో ఓ భాగంగా, 'మేక్ ఇట్ యువర్స్' (MIY) పేరిట ఓ పర్సనలైజ్డ్ కస్టమైజేషన్ ప్లాట్ ‌ఫామ్ ‌ను మొదలు పెట్టింది.

ఇక ఇందులో భాగంగానే, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన మోటార్‌సైకిళ్ళు, వాటి ఓల్డ్ స్కూల్ డిజైన్ ‌తో సరళమైన రూపకల్ప నకు ప్రసిద్ది చెందినవి కాబట్టి ఇది వాటిని కస్టమైజ్ చేయటానికి చాలా సులువుగా మార్చబోతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రారంభించిన ఈ సరికొత్త ప్రణాళికతో కస్టమర్లు ఇప్పుడు వారి మోటార్ ‌సైకిళ్లను కొనుగోలు చేసే సమయంలోనే పూర్తిగా కస్టమైజ్ చేసుకోవటానికి వివిధ రకాల ఆప్షన్లను కస్టమర్స్ కి అందుబాటులో ఉంచింది రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ.


ఇందులో భాగంగానే కస్టమైజేషన్ లేదా పర్సనలైజేషన్ ‌కు సంబంధించి కంపెనీ ఓ కొత్త యాప్‌ను కూడా డెవలప్ చేసింది రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపె . ఈ యాప్ 3డి కాన్ఫిగరేటర్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. దీనితో కస్టమర్లు అందుబాటులో ఉన్న వేలాది కాంబినేషన్స్ ద్వారా తమ అభిమాన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్‌ను వారికి నచ్చిన విధంగా వర్చ్యువల్ ‌గా కస్టమైజ్ చేసుకునే అవకాశం కల్పించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ బైక్స్ బుకింగ్ చేసుకునే సమయంలోనే కలర్ ఆప్షన్లు, వేరియంట్లు, బాడీ గ్రాఫిక్స్, జెన్యూన్ మోటార్‌సైకిల్ యాక్ససరీస్స్ ‌ను వారికి ఇష్టమొచ్చినట్లు ఎంచుకోవచ్చు. కస్టమర్ ‌లు యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న తదుపరి, వారు తమ మోటార్‌సైకిల్ సంబంధించి డెలివరీ టైమ్‌లైన్ ‌కు సంబంధించిన పూర్తి సమాచారం కూడా సదరు యాప్‌ లోనే చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: