తెలుగు దేశం భారత దేశంలో పండుగలకు  కొదవ లేదు.. పండుగ పండుగకు కొన్ని కంపెనీలు సేల్స్ ను పెంచుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కొత్త ఆఫర్లను అందించగా, మరి కొన్ని కంపెనీలు మాత్రం కొనుగోలు వస్తువుల పై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఇక జనాలు కూడా వాటిని కొనడానికి  ఎగబడుతున్నారు. ముఖ్యంగా పండుగ సీజన్లో ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్లు బాగా ఉపయోగపడతాయి.



ప్రస్తుతం పోటీ మీద ఆధారపడి వాణిజ్య వ్యాపారాలు , తదితర కంపెనీలు ఇలాంటి కొత్త స్కీమ్ లు కూడా అందిస్తున్నారు. వాహనాలు కొనుగోలు చేసే వాళ్లకు ఇది సువర్ణావకాశం.. దసరా , దీపావళి పండుగలు వస్తాయి అంటే కొత్త కంపెనీ లు కూడా కొత్త స్కీమ్ లు, ఆఫర్లు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.  కార్లు, బైకులు కొనుగోలు చేసే వారికి ఈ పండుగలు బాగా ఉపయోగ పడుతాయి. ఇప్పుడు భారత దేశ వ్యాప్తంగా ఆఫర్స్ అంటూ వార్త చక్కర్లు కొడుతోంది.



నిన్న , మొన్నటి దాకా దసరా పండగ అంటూ కొత్త ఆఫర్లు ఉన్నాయి.. అది కాస్త అవ్వగానే దీపావళి ఆఫర్స్ మొదలు  పెట్టారు.. కార్లకు బైకుల కంపెనీలు మాత్రం ఇలాంటి ఆఫర్ణు పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ల కంపెనీ నుంచి వచ్చే మరో ప్రొడక్ట్ పై జనాల దృష్టిని మరల్చేందకు ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి..అయితే మాత్రం మార్కెట్ పరంగా ఆధిపత్యాన్ని  కొనసాగించాలని ఆలోచిస్తున్నారు. రాయితీని అందించడంతో పాటుగా మరి కొన్ని బహుమతులను కూడా అందించారు. ఈ ఆఫర్ల కారణంగా కంపెనీ పేర్లు ప్రమోట్ అవుతున్నాయి. అలా ఆటో మొబైల్ కంపెనీ లు బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నాయి.. దసరా పండుగ ముగిసింది..దీపావళి పండుగ రోజు మాత్రమే అన్నట్లు ఇప్పుడు మాత్రం ఓ రేంజులో దూసుకు పోతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: