కొత్త మోడల్స్ తో పాటుగా ఇష్టమైన కలర్ కూడా ఉంటే ఇంక వారి సంతోషానికి అవధులు ఉండవు.. అయితే చాలా మందికి కార్లు కొని డ్రైవ్ చేయాలనే పిచ్చి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్త కార్లు చాలానే వచ్చాయి. ముఖ్యంగా బెంజ్, ఆడి వంటి కార్లు ఇప్పుడు కొత్త మోడల్స్ , కొత్త ఫీచర్లు ఉన్న కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఇప్పుడు కూడా ఒక కారును మార్కెట్ లోకి విడుదల చేశారు..



ఆ కారు పేరేంటి.. అందులో అందరికీ నచ్చే విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..బెంజ్ కారు అంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. అయితే ఆ కారు మార్కెట్ లోకి వస్తుందంటే ఇంక కారు ప్రియుల సంతోషానికి అవధులు ఉండవు.. మెర్సెడెజ్ బెంజ్ సంస్థ తన ఈక్యూసీ మోడల్లోని ఫుల్లీ ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్ యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ విద్యుత్ కారు ధర వచ్చేసి రూ.99.30 లక్షలుగా నిర్దేశించింది. ఈ ధర కేవలం మొదటి 50 యూనిట్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది.. వాల్ మౌంటెన్ చార్జర్ ను కూడా అందిస్తుంది.



ఫ్రంట్ గ్రిల్, అతిపెద్ద త్రీ పాయింటెడ్ స్టార్, స్టైలిష్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ ప్రొజెక్టర్ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, డబుల్ అప్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్ తో పాటుగా చాలానే ఉన్నాయి. అయితే 4-వీల్ డ్రైవ్ సిస్టంతో పాటు 80 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ బ్యాక్ ను కలిగి ఉంది. ఇది కాకుండా మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ 405 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 765 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. జీరో నుంచి 100 కిలో మీటర్లు 5.1 సెకండ్లలోనే అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. ఇలా చూసుకుంటే బెంజ్ కారులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అంటున్నారు. దీపావళికి మరో కొత్త ఫీచర్లతో మరో కారు రానుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: