యువత ఎక్కువగా బైక్ లను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ముఖ్యంగా ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాటికి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు.అయితే ఇప్పుడు మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిమాండ్ మాత్రం భారీగా పెరుగుతున్నాయి. అందుకే వీటికి ప్రస్తుతం డిమాండ్ కూడా ఎక్కువే ఉంటుంది. టీవీఎస్ కంపెనీ లో ఇటీవల లాంఛ్ అయిన స్కూటర్..ఐక్యూబ్ విద్యుత్స్కూటర్ ను విడుదల చేసింది. తాజాగా దీనిపై టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. మరి ఈ స్కూటర్ ప్రదర్శన, స్టైల్, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. 



బైక్ చూడటానికి చాలా సింపుల్ గా ఉండి, విభిన్న కోణాలలో అద్భుతంగా కనిపిస్తుంది. అయితే మామూలు ఇందనం వాహనాల కంటే కూడా చాలా స్టైల్ గా, రిచ్ లుక్ తో కనపడుతుంది.బాడీ మొత్తం ఎల్ఈడీ లైట్లతో వెలిగిపోతోంది. హెడ్ లైట్లు, టెయిల్ ల్యాంపులు, ఇండికేటర్ సిగ్నల్స్ కు ఎల్ఈడీ లైట్లనే వాడారు. ముందుభాగాన్ని గమనిస్తే ఈ స్కూటర్ ను మినిమాలిస్టిక్ డిజైన్ తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఫ్రంట్ అల్లాయ్ వీల్స్ ను జూపిటర్ నుంచి అరువు తీసుకున్న కారణంగా అందంగా కనిపిస్తున్నాయి... ప్రస్తుతం మార్కెట్ లో ఈ స్కూటర్లు వైట్ కలర్ లో మాత్రమే లభిస్తున్నాయి.. 




టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో టీవీఎస్ మోటార్స్ లేటెస్ట్ కనెక్టెడ్ టెక్నాలజీని పొందుపరించింది. అదే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్. దీన్ని వాట్సాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉన్న డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ ను మొబైల్ యాప్ కు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో జియో ఫెన్సింగ్, రిమోట్ బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్, నేవిగేషన్ అసిస్ట్, పార్క్ డ్ స్పేస్, సర్వీస్ రిమైండర్, మోడ్ సమాచారం, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ అలెర్టులు, స్పీడు అలెర్టులు లాంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ ఎక్స్ కనెక్టెడ్ వాట్సాప్ టెక్నాలజీ ద్వారా దగ్గరలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల గురించి ఇట్లే తెలుసుకోవచ్చు.. ఇకపోతే గంటకు అధికంగా 50 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే 70 నుంచి 80 కిలో మీటర్ల మేరకు ప్రయాణించవచ్చు.. టీవీఎస్ ఐక్యూబ్ ధర అక్కడ రూ.1.15 లక్షల రూపాయలుగా ఉంది... 

మరింత సమాచారం తెలుసుకోండి: