కార్ల కంపెనీలు ప్రజల అవసరాలను బట్టి కొత్త ఫీచర్లు ఉండే టెక్నాలజీ తో మార్కెట్ లోకి లాంఛ్ చేస్తున్నారు. అయితే, కొన్ని కార్ల పై మరిన్ని ప్రత్యేకతలతో పాటుగా భారీ డిస్కౌంట్లు కూడా ఉంటాయి.. అలాంటి వాటిలో హోండా అమేజ్ కారు ఒకటి..ఈ మధ్య కార్ల సేల్స్ భారీగా తగ్గడంతో కంపెనీలు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది..32 వేల రూపాయల వరకు క్యాష్ డిస్కౌంటు ప్రకటించింది. ఇవి కాకుండా అదనపు రాయితీలను కూడా ఇచ్చింది హోండా కంపెనీ.. 



జూన్ లో మార్కెట్ లోకి వచ్చిన ఈ కారు పై ఇప్పటికే లక్ష రూపాయలు డిస్కౌంట్ ను అందిస్తుంది. ఇప్పుడు మరో సారి తాజాగా హోండా అమేజ్ పై రాయితీనిచ్చింది. ఈ మోడల్ పై 32 వేల రూపాయల క్యాష్ డిస్కౌంటు, 20 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ బోనస్ ను ప్రకటించింది. అంతేకాకుండా 5 సంవత్సరాల పాటు అన్ లిమిటెడ్ కిలోమీటర్ల వరకు వారంటీని పొడిగించింది. మాములుగా 3 ఏళ్ల పాటు మాత్రమే వారంటీనీ మరో రెండేళ్లు పొడిగించింది..



ఆటోమేటిక్ ఏసీ ఇంజిన్, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్స్ తో పాటు తదితర ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ముందు భాగంలో రెండు ఎయిర్ బ్యాగులు, ప్రమాణికమైన ఏసీఈ బాడీ స్ట్రక్చర్, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిజైన్ ను కలిగిన యాంటి బ్రేకింగ్ వ్యవస్థ, ఈసీయూ మొబిలైజర్ సిస్టం, చిన్నపిల్లల సెఫ్టీ కోసం స్టాండార్డ్ ఐసోఫిక్స్, రివర్స్ లో పార్కింగ్ చేసెందుకు రేర్ పార్కింగ్ కెమెరా లాంటి సెఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది..కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ వాహనం ధర ఎక్స్ షోరూంలో 6.10 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. డీజిల్ వేరియంట్ అయితే రూ.7.56లక్షలుగా నిర్దేశించారు.. మరి ఇప్పుడు క్రిస్టమస్ , సంక్రాంతికి మరి కొన్ని ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది అని అంచనా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: