మార్చి నుంచి దాదాపు ఏడు నెలల వరకు కరోనా మహమ్మారి మృత్యువు గంట మోగించింది.. చివరికి ప్రజల ఎదురు దాడికి దాదాపు తోక ముడిచింది.. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.. అలాంటి సమయంలో మార్కెట్లోకి కొత్త వస్తువు కాదు కదా.. ఉన్న వస్తువులను కూడా మార్కెట్ చేయలేక దుకాణాలను మూసుకున్నారు... తీవ్ర నష్టాలను చూసిన కొందరి ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు.. అయితే అలాంటి సమయంలో కూడా ఒక కారు మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఆ కారెంటో ఇప్పుడు వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..



హ్యుండాయ్ సంస్థ తన కంపెనీ నుంచి తయారైన ఆరు కార్ల పై భారీ డిస్కౌంట్ ను అందించనుంది.. దిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో కనువిందు చేసిన హ్యుండాయ్ టక్సన్ కారు ఇటీవలే మార్కెట్లోకి లాంఛ్ అయ్యింది. ఆ కార్లపై మార్కెట్ ధర కన్నా కూడా 25 వేలు తగ్గించి ఇస్తున్నట్లు ప్రకటించారు. హ్యుండాయ్ ఎలంత్రాపై భారీగా లక్ష రూపాయల వరకు రాయితీనిచ్చిందీ సంస్థ. ప్రస్తుతం బీఎస్6 పెట్రోల్ మోడల్లో లభ్యమవుతున్న ఈ వాహనంపై ఎక్స్ ఛేంజ్ ఆఫర్లతో పాటు క్యాష్ డిస్కౌంట్ కూడా ప్రకటించింది. బీఎస్6 ఇలైట్ ఐ20 పెట్రోల్ మోడల్ పై దాదాపు 35 వేల రూపాయల క్యాష్ డిస్కౌంటును ఇచ్చింది. అంతేకాకుండా పాత గ్రాండ్ ఐ10 వాహనంపై హ్యండాయ్ సంస్థ గరిష్ఠంగా 45 వేల రూపాయల తగ్గించి ఇచ్చింది. 



ఈ రెండు మాత్రమే కాకుండా హ్యుండాయ్ శాంత్రో వాహనంలోని బేస్ ఎరా మోడల్ పై 30 వేలు, ఇతర వేరియంట్లపై 40 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు.గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ కు మాత్రమే పెట్రోల్, డిజీల్ రెండు వేరియంట్లపై 25 వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తున్నారు.ప్రస్తుతంకరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోన్న తరుణంలో ఆర్థికంగా తీవ్రంగా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి పలుదేశాలు. ఆటోరంగం పరిస్థితి అయితే దారుణంగా ఉంది.ఇప్పుడు లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు.. దీంతో మళ్లీ సేల్స్ పుంజుకున్నాయి.. ఆ సంస్థ మరి కొన్ని కార్ల మీద కూడా అందించింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: