గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది అన్నీ రంగాలు తీవ్ర నష్టాన్ని చవి చూశాయి.. ముఖ్యంగా ఆటో మొబైల్స్.. ఏడాది చివరి వరకు సేల్స్ మందకొడిగా సాగాయి. కరోనా కారణంగా మార్కెట్స్ లేకపోవడం ఒక కారణం కాగా, చేతిలో పైసలు లేకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వీటి సేల్స్ పడిపోవడానికి అసలు కారణాలు ఎంటో తెలుసుకుందాం.. వాణిజ్య కంపెనీలు తీవ్ర  నష్టాలను చూసాయి..



ఆటో ఇండస్ట్రీ బాడీ సియాం విడుదల చేసిన డేటా ప్రకారం కార్లు, ఎస్ ‌యూవీలు, ఎంపీవీ/యూవీ వాహనాలతో సహా ప్రయాణికుల వాహనాల విక్రయాలన్నీ కలుపుకుని 17.8 లక్షల యూనిట్లకే పరిమితం అయ్యాయి. దశాబ్ది క్రితం 2010-11లో ప్రయాణికుల కార్ల విక్రయాలు18.1 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కార్ల కొనుగోలు తో పోలిస్తే బైకుల కొనుగోళ్లు కాస్త ఎక్కువగానే మెరుగు పడ్డాయి.



2013-14లో 109.4 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడు కాగా, గత తొమ్మిది నెలల్లో 107.7 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2013-14తో పోలిస్తే ఈ ఏడాది టూ వీలర్‌ విక్రయాలు అత్యంత కనిష్ఠ స్థాయికి చేరాయి. మారుతి సుజుకి ఎండీ కెనిచి అయుకవా మాట్లాడుతూ కార్ల విక్రయాలను పెంచుకోవడానికి ఆటో పరిశ్రమ కష్టపడి పని చేస్తున్నదని చెప్పారు. గత కొన్ని నెలలుగా విక్రయాలు మెరుగైనా, పురోగతి సాధించినట్లేనని చెప్పడం తప్పే అవుతుందని అంటున్నారు.



ఈ కార్ల సేల్స్ పూర్తిగా పడిపోవడానికి ముఖ్య కారణం ఆటో మొబైల్స్ కావలసిన ముడి భాగాలు దొరకక పోవడమే అని సదరు అభిప్రాయ పడుతున్నారు. వచ్చే బడ్జెట్‌ ప్రతిపాదనల్లో స్క్రాపేజీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందని వేచిచూస్తున్నట్లు కెనిచి అయుకవా తెలిపారు. దీనివల్ల ఇన్సెంటివ్‌ల ద్వారా కాలుష్య కారక వాహనాలను తొలగించవచ్చునన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి గల పరిమిత వనరుల నేపథ్యంలో ప్రస్తుతానికి ఆటో మొబైల్‌ పరిశ్రమ పై జీఎస్టీ తగ్గింపును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: