గాల్లో ఎగిరేది అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పక్షులు అంతకన్నా ఎక్కువ అంటే విమానాలు అయితే ఇప్పుడు ఎగిరే వాహనం కూడా అందుబాటులోకి వచ్చింది. అంతగా షాక్ అవ్వకండి. మీరు విన్నది నిజమే ఎగిరే వాహనం ఉంది. అది కూడా కారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే.. ఎగిరే కారు వచ్చేసింది. ఈ కారు ఎలా ఎగురుతుంది. అసలు కారణం ఎంటి? ఈ కారుకు ఉన్న ప్రత్యేకతలు ఎంటి? ఈ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 



విమానాలలో ప్రయాణించాలంటే కొంచెం ఖర్చుతో కూడినది.. కానీ విమానంలో ప్రయాణించాలి అన్న కోరిక మాత్రం అందరికీ ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఫ్లయింగ్ కాడిలాక్ ను రూపొందించారు.. జనరల్ మోటార్స్ మంగళవారం ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కాడిలాక్ ను ప్రవేశపెట్టింది.. ఈ ఫ్లయింగ్ కార్ ప్రత్యేకత ఏమిటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం. ఇది డ్రైవర్ లేకుండా స్వయంగా పైకి ఎగురుతుంది కిందికి వస్తుంది. రోడ్లపైన ఎగిరే ఈ కారు ప్రయాణికులకు విమానంలో ప్రయాణించిన ఫీలింగ్ ను కలిగిస్తుంది. 



ఈ కారులో ఒకరు మాత్రమే ప్రయాణించాలి..సెల్ఫ్ డ్రైవింగ్ ఉంది. చూడటానికి హెలికాప్టర్ లాగే ఉంటుంది.భూమి మీద నుండి నేరుగా పైకి టేకాఫ్ అవుతుంది .అలాగే ల్యాండింగ్ కూడా అవుతుంది.ఈ ఫ్లయింగ్ కార్ గంటకు 88.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది పూర్తిగా సెల్ఫ్ ఆటోమేటెడ్ , ఆల్ ఎలక్ట్రిక్ వాహనం. దీనిలో 90 కిలోవాట్ల మోటారు, జిఎం అల్టియం బ్యాటరీ బ్యాక్, 8 రోటర్ లతో అల్ట్రా లైట్ బాడీ తో తయారు చేశారు. వెనుక స్లైడింగ్ డోర్స్, పనోరమ మిక్ గ్లాసులు చాలా ఆకర్షణీయమైన రూపాన్ని ఫ్లయింగ్ కార్ కు ఇచ్చింది క్యాబిన్లో రాప్ అరౌండ్ లాంజ్ వంటి సిటింగ్ ను ఏర్పరచారు. ఈ కారును సెన్సార్ల సాయంతో నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: