ప్రముఖ ఆన్ లైన్ మార్కెటింగ్ దిగ్గజ కంపెనీ అమెజాన్ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నారు. అటు వస్తువుల పై భారీ తగ్గింపు తో పాటుగా .. కొత్త ఆలోచనలు కూడా చేస్తున్నారు. అమెజాన్ వస్తువులను చేరేవసెందుకు వీలుగా ఉండేలా కొన్ని వాహనాలను అందుబాటు లోకి తీసుకువచ్చారు. ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా ఎలక్ట్రిక్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. కొనుగోలు దార్లకు వస్తువుల సరఫరాకు ఎలక్ట్రికల్‌ వాహనాలను వినియోగించనున్న అమెజాన్‌ ఈ మేరకు మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్‌ తో మంగళ వారం డీల్‌ కుదుర్చుకుంది.


సుమారు ఏడు నగరాల్లో లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే మహీంద్రా 'ట్రెయో జోర్' త్రీ వీలర్ వంద ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటు లో ఉంచినట్లు తెలిపింది.. మెట్రో నగరాల్లో వీటిని ఎక్కువగా వాడనున్నట్లు తెలుస్తుంది. డీల్‌పై మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సీఎండీ మహేష్ బాబు సంతోసం వ్యక్తం చేశారు. కార్బన్‌ ఉద్గారాలను నివారించి, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అమెజాన్‌తో భాగస్వామ్యం కావడం గర్వ కారణమన్నారు. ట్రెయో జోర్ 8 కిలోవాట్ల అత్యుత్తమ పరిశ్రమ శక్తి తో, 550 కిలోల అత్యధిక తరగతి పేలోడ్‌తో ప్రత్యేకమైన కస్టమర్ విలువ విలువైన సేవలను అందిస్తుందన్నారు..


ఇకపోతే గత ఏడాది లో చెప్పినట్లుగా 2025 నాటికి అమెజాన్ ఇండియా తన డెలివరీ వాహనాల సముదాయంలో 10 వేల ఎలక్ట్రిక్ వాహనాలను విని యోగించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 2025-26 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా ఎలక్ట్రిక్ వెహికల్ త్రీ వీలర్‌ విభాగం లో మహీంద్రా ట్రె జోర్‌కు 56 శాతం మార్కెట్ లో వాటాలు ఉన్నాయి.అమెజాన్‌ తో పాటు, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్ మొదలగు కంపెనీలు మహీంద్రా తో డీల్ కుదుర్చుకున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: