యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న వాటిలో చాలా రకాల బైకులు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఫీచర్స్ తో మరో కొత్త బైక్ ను మార్కెట్ లోకి వదిలారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..అత్యుత్తమ మోటార్ సైకిళ్లు విడుదల చేస్తోన్న సంస్థ జావా. తాజాగా ఈ ఐరోపా కంపెనీ సరికొత్త 2021 టూవీలర్ ను భారత విపణిలో లాంచే చేసింది. అదే జావా ఫార్టీ టూ మోటార్ సైకిల్. దిల్లీ ఎక్స్ షోరూంలో ఈ 2021 జావా మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.84 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక ఫీచర్లు, ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చిని ఈ బైక్ ఆకట్టుకుంటోంది.


మోటార్ సైకిల్ మూడు కలర్స్ లో లభ్యమవుతుంది. సిరియస్ వైట్, ఆల్ స్టార్ బ్లాక్, ఓరియన్ రెడ్ కలర్లో లభ్యమవుతుంది. ఈ మూడు పెయింట్ కలర్స్ తో పాటు ఇంధన ట్యాంకుపై 42, క్లాసిక్ లెజెండ్స్ అనే గ్రాఫిక్స్ అక్షరాలున్నాయి. ఈ 2021 జావా ఫార్టీ టూ మోటార్ సైకిళ్లు బార్ ఎండి మిర్రర్లతో పాటు వైడర్ హ్యాండిల్ బార్ కలిగి ఉండి కంఫర్టబుల్ సీటును కలిగి ఉంది.. వీటితో పాటుగా ట్యూబ్ లెస్ టైర్లు, రీడిజైన్ సైడ్ స్టాండ్, అల్లాయ్ వీల్స్ తో పాటు హెడ్ ల్యాంపు గ్రిల్, ఫ్లైస్క్రీన్ యాక్సెసిరీస్ ను కలిగి ఉంది.


సరికొత్త మోటార్ సైకిల్ 293సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. ఫలింతగా క్రాస్ పోర్ట్ ప్లో వల్ల మెరుగైన మైలేజి, స్ట్రాంగర్ యాగ్జలరేషన్, థాటిల్ ఎక్సాహాస్ట్ లాంటివి మెరుగుపడ్డాయి.బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే.. ఇరువైపులా డిస్క్ బ్రేకులతో పాటు స్టాండర్డ్ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ను కలిగి ఉంది. ఇది 2 కేజీల బరువు తేలికగా ఉంది. ఈ మోటార్ సైకిల్ 172 కేజీల బరువుంది. అంతేకాకుండా హ్యాండ్లిగ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఈ 2021 జావా 42 మోటార్సా సైకిల్ డెలివరీలు జరగనున్నాయి.  దేశ వ్యాప్తంగా 181 షో రూం ల ద్వారా ఈ బైకు లభించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: