ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా ఎప్పటికప్పుడు కొత్త బైక్ లని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈ మధ్య మార్కెట్ లోకి వచ్చిన బైక్ యువతను ఆకట్టుకునే విధంగా ఉంది. మంచి సేల్స్ ను కూడా రాబట్టింది. దీంతో మొన్న మరో బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఆ బైక్ ఫీచర్స్ యువతిని ఆకట్టుకోవడంతో మరో బైక్ ను లాంఛ్  చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..


తాజాగా హోండా సంస్థ తన సరికొత్త మోడల్ ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. అదే హోండా సీబీ350 ఆర్ఎస్. మేడిన్ ఇండియా ఫర్ ద వరల్డ్ లో భాగంగా విడుదలైన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. ఎక్స్ షోరూంలో హోండా సీబీ350 ఆర్ఎస్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.96 లక్షలు. అగ్రెసివ్ డిజైన్, ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ అధునాతన స్టైల్ తో తెగ ఆకట్టుకుంటుంది. సీబీ 350 ఆర్ఎస్ మోటార్ సైకిల్ భారీ ఫ్యూయల్ ట్యాంకును కలిగి ఉండి Y- ఆకారపు అల్లాయ్ వీల్స్ తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా వృత్తాకారపు ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, నేత్రాకరపు ఎల్ఈడీ వింకర్లత, అండర్ సీట్ స్లీక్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపుల వల్ల మోడర్న్ రోడ్ స్టర్ లుక్ తో  మార్కెట్ లోకి హవాను కొనసాగిస్తోంది.


ఫస్డ్ అడ్వాన్సెడ్ డిజిటల్ అనలాగ్ మీటర్ తో పాటు ఇంటిగ్రేటెడ్ డీటేల్స్ టార్క్ కంట్రోల్ తో పాటు ఏబీఎస్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ తో కూడిన ఇంజిన్ ఇన్హిబిటర్ ఇందులో ఉంది. గేర్ పిస్టన్ ఇండికేటర్, బ్యాటరీ వోల్టేజి లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. 5500 ఆర్పీఎం వద్ద 20.7 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 30 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా అడ్వాన్సెడ్ పీజీఎం-ఎఫ్ఐ సిస్టంతో పనిచేస్తుంది. అంతేకాదు సింగిల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. మొత్తానికి ఈ బైక్ అందరినీ ఆలోచనలో పడేసింది... సేల్స్ కూడా మార్కెట్లో ఎక్కువగానే ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: