కొత్త కొత్త వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. ఫేమస్ కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు పెట్రోల్ బాదుడును తట్టుకోలేక అందరూ ఎలెక్ట్రానిక్ వాహనాలను తయారు చేసే ఆలోచన లో పడ్డారు. కర్ణాటక , తమిళ నాడు లో ఉన్న పలు ఆటో మొబైల్ కంపెనీలు అదే పనిలో ఉన్నాయి.. ఎలెక్ట్రానిక్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్ల ను కూడా కొన్ని కంపెనీలు ఆవిష్కరిస్తున్నారు. హోండా , బజాజ్ లతో పాటుగా మరి కొన్ని కంపెనీలు ఈ ఎలెక్ట్రానిక్ స్కూటర్లు లాంఛ్ చేస్తున్నారు.వాటికి యువత ఆకర్షితులు అవుతున్నారు. వీటికి ఛార్జింగ్ పెట్టుకోడానికి బ్యాటరీ సిస్టమ్ తక్కువగా ఉంది.  ఈ సమస్యను అధిగమించడానికి లాగ్ 9 కొత్త ఆలోచన చేసింది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..


బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ లాగ్‌ 9 మెటీరియల్స్‌.. ఓ ర్యాపిడ్‌ చార్జింగ్‌ బ్యాటరీ ని ఆవిష్కరించింది. ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్‌ ఆధారిత వాహనాల కోసం రూపొందించిన ఈ బ్యాటరీ.. కేవలం 15 నిమిషాల్లో నే ఫుల్‌ చార్జింగ్‌ కావడం విశేషం. ఈ బ్యాటరీ 15 ఏండ్లకు పైగా పని చేస్తుందని, కాబట్టి తక్కువ ఖర్చు తోనే ఎక్కువ మైలేజీని వినియోగదారులు సొంతం చేసుకోవచ్చని మంగళవారం సంస్థ తెలియజేసింది. అంతేగాక ప్రస్తుతం ఎంతో ఆదరణ ఉన్న లిథియం-ఐయాన్‌ బ్యాటరీల తో పోల్చితే తమ బ్యాటరీలు ఐదు రెట్లు అధిక శక్తిని కలిగి ఉంటాయని, అగ్ని ప్రమాదాలకున్న చాలా రేర్ అని సంస్థ వెల్లడించింది..


మాములుగా ఈ  బ్యాటరీ తయారీలో గ్రాఫెన్‌ మెటీరియల్‌ను వినియోగించామన్న సంస్థ.. 2023 మార్చి ఆఖరుకల్లా 20వేలకు పైగా బ్యాటరీల అమ్మకం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయా సంస్థ పేర్కొన్నది. అధిక పెట్రో ధరలు, పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో చాలామంది ఇప్పుడు విద్యుత్‌ ఆధారిత వాహనాల కొనుగోలుకే మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. దీంతో తమ ఈ సూపర్‌ బ్యాటరీకి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందన్న ఆశాభావాన్ని లాగ్‌ 9 మెటీరియల్స్‌ వ్యక్తం చేస్తున్నది.. ఎలెక్ట్రిక్ వాహనాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆలోచన చేసినట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: