ఇండియా మార్కెట్లో ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ అయిన 'టాటా మోటార్స్' గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన కంపెనీ. ఇక తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కార్ ని టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ఎడిషన్‌ను తిరిగి మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపడం జరిగింది. అయితే ఇక ఇప్పుడు ఇక ఈ హ్యాచ్‌బ్యాక్ కి సంబంధించిన మరింత సమాచారం అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం చూసినట్లయితే కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ఎడిషన్‌ 2021 ఆగస్టు 4 న ప్రారంభించే అవకాశం ఉందట.ఇక టాటా కంపెనీ 2020 జనవరిలో ఫేస్‌లిఫ్టెడ్ టాటా టియాగోను ప్రవేశపెట్టడానికి ముందే ఈ హ్యాచ్‌బ్యాక్ ఎన్‌ఆర్‌జి వేరియంట్‌ అమ్మకాలను నిలిపివేయడం జరిగింది. కానీ ఇప్పుడు టాటా మోటార్స్ ఈ వేరియంట్‌ను ఎస్‌యూవీ సరికొత్త స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో ఫేస్‌లిఫ్టెడ్ టాటా టియాగోతో తిరిగి ఇండియా మార్కెట్లో విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి కార్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఇంకా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి మోడల్ ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్ ఇంకా టెయిల్‌గేట్‌పై బ్లాక్ ప్లాస్టిక్ ఎలిమెంట్ ఇంకా ఎస్‌యూవీలా కనిపించేలా అప్డేటెడ్ వీల్స్ పొందే అవకాశం ఉంటుందట.ఇక టాటా మోటార్స్  ఈ కొత్త వెర్షన్ ని , దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కలిగి ఉంటుంది. ఇక టాటా టియాగో స్టాండర్డ్ మోడల్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంది. అయితే ఈ కొత్త మోడల్ సరికొత్త డిజైన్ దాదాపు దాని స్టాండర్డ్ టాటా టియాగో మోడల్ లాగానే ఉంటుందట.ఇక ఈ కొత్త టియాగో ఎన్‌ఆర్‌జి వెర్షన్‌లో ఎసి వెంట్స్ ఇంకా గేర్ లివర్ చుట్టూ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ ఫినిషింగ్ అనేది ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ వెర్షన్ మల్టిపుల్ అప్హోల్స్టరీని కలిగి ఉంటుందట. ఇక అంతే కాకుండా ఇందులో ట్రై-యారో డిజైన్ ఎలిమెంట్స్ ఫాబ్రిక్ మీద కూడా ఉపయోగించవచ్చు. మొత్తానికి ఇది వాహనదారులకు బాగా అనుకూలంగా ఉండే విధంగా తయారవుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: