ఇక ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువైపోతున్నాయి.ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగిపోయింది. ఇక ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. అలాగే మరికొన్ని కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మునిగిపోయాయి. అంతే కాకుండా కేంద్ర ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై అనేక రాయితీలు కూడా కల్పించడం జరుగుతుంది.జనాలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తిని చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న పెట్రోల్ ధరలు కూడా ఒకటిగా భావిస్తున్నారు. ఇక ఇదిలాగ ఉండగా కేరళ రాష్ట్రం ఇప్పుడొక ఒక షాకింగ్ న్యూస్ విడుదల చేసింది. ఇక నుంచి ఫ్రీ ఛార్జింగ్ సదుపాయం అనేది ఉండదంటూ తెలిపింది.

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొన్ని రాష్ట్రాలలో ఫ్రీ పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు అనేవి ఓపెన్ చేయడం జరిగింది. ఇక కేరళ రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్లు ప్రారంభించబడటం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్స్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడం జరిగింది.ఇక ఇంతకు ముందు ఈ ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసుకోవడానికి అనుమతించేవారట. కానీ ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్కీమ్ అనేది ఇక రాబోయే రెండు వారాల్లో నిలిపివేయబడటం జరుగుతుంది. కానీ ఈ ఛార్జింగ్ స్టేషన్లను వాడుకోవడానికి ఇకపై ఛార్జ్ చేయబడుతుంది. ఇక దీనిలో భాగంగానే ప్రతి యూనిట్ కి కూడా రూ. 15 వరకు ఛార్జ్ చేయవచ్చని భావిస్తున్నారు.ఇక అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుండటం జరుగుతుంది. ఇక దీని ప్రకారం, గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారీ రాయితీలను ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: