"ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్'' (Ola Electric Scooter) ఈ పేరుకి ఇప్పుడు పెద్దగా పరిచయం అనేది ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు కూడా ఎన్నో రోజులుగా ఎదురుచూసిన ఈ స్కూటర్ ఎట్టకేలకు ఇండియా మార్కెట్లో విడుదలవ్వడం జరిగింది. అయితే ఈ స్కూటర్ ఇప్పుడు ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది.ఇక ola Electric Scooters వచ్చే ఏడాది అనగా 2022 నుంచి ఎగుమతి చేయబడతాయని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపడం జరిగింది.వచ్చే ఏడాది నుంచి కంపెనీ అమెరికాకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా పేర్కొనడం జరిగింది. ఇక దీన్ని బట్టి చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఖండాంతరాలు దాటడానికి ఇప్పుడు రెడీగా ఉంది.

ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియా మార్కెట్‌లో అతి తక్కువ కాలంలోనే సంచలనం సృష్టించడం జరిగింది.అయితే ఇక ఇప్పుడు దాని ఉనికిని ఇతర దేశాల్లో కూడా చాటుకోవడానికి తగిన సన్నాహాలు రెడీ చేస్తుంది. ఇక ఓలా కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని తమిళనాడులో నిర్మించడం జరుగుతుంది. ఇక ఈ కొత్త ప్లాంట్ లో ప్రతి సంవత్సరం 10 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా తయారు చేసే అవకాశం ఉందట.ఇక ఓలా కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను (S1 ఇంకా S1 Pro) విడుదల చేయడం జరిగింది. ఇక ఈ స్కూటర్ల ధరల విషయానికి వస్తే ఓలా S1 ధర వచ్చేసి రూ. 99,999 కాగా అలాగే S1 ప్రో ధర వచ్చేసి రూ. 1,29,999 గా వుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియా మార్కెట్లో విడుదల కాకముందే అత్యంత ప్రజాదరణ పొందడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: