ఫేమస్ జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా మోటార్ ఇండియా ఇటీవల ఇండియన్ మార్కెట్లో తమ కొత్త 2021 R15 V4 స్పోర్ట్స్ బైక్ ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసినదే. ఇక యమహా కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ సూపర్ స్పోర్ట్ మోటార్‌సైకిల్ తో పాటుగా ఏరోక్స్ 155 (Aerox 155) అనే స్కూటర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. యమహా కంపెనీ ఇప్పుడు తమ కొత్త యమహా ఆర్15 వి4 (Yamaha R15 V4) మోటార్‌ బైక్ ని డెలివరీలను కూడా ప్రారంభించడం జరిగింది. ఇక ఇండియన్ మార్కెట్లో ఈ కొత్త యమహా ఆర్ 15 మోటార్‌ బైక్ ధరలు వచ్చేసి రూ. 1,67,800/- నుండి రూ. 1,79,800/- (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇక ఈకొత్త బైక్ పాత మోడల్ ధరతో పోల్చుకుంటే ఈ కొత్త బైక్ మోడల్ ధర వచ్చేసి 10,000/- రూపాయలు ఎక్కుగా ఉంటుంది.ఇక ఇండియన్ మార్కెట్లో ఈ సరి కొత్త యమహా ఆర్15 వి4 బైక్‌ను ఐదు ఆకర్షణీయమైన రంగులలో అందించడం జరుగుతుంది. ఇక అలాగే ఈ బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్) ఇంకా క్విక్ షిఫ్టర్ వంటి కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లను కూడా జోడించడం జరిగింది.

ఇక ఈ బైక్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ట్రాక్ ఇంకా స్ట్రీట్ మోడ్‌తో YZF-R1 మోడల్ నుండి ప్రేరణ పొందిన ఈ కొత్త ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కూడా ఈ బైక్ కలిగి ఉంటుంది.ఇక ఈ కొత్త యమహా ఆర్15 వి4.0 డిజైన్ ను కనుక గమనిస్తే...ఇది పాత మోడల్‌ కన్నా కూడా పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక ఇదివరకటి మోడల్ డ్యూయల్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ స్థానంలో కొత్త సింగిల్ పాడ్ హెడ్‌ల్యాంప్ సెటప్ ను ఉపయోగించడం జరిగింది. ఇక ఈ కొత్త బైక్ చూడటానికి యమహా ఆర్7 స్పోర్ట్స్ బైక్ నుండి ప్రేరణ పొందినట్లుగా కనిపిస్తుంది.ఇక ఈ మోడల్ లో మరింత అగ్రెసివ్ గా ఉండే ఫెయిరింగ్స్ అలాగే మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఇంకా అలాగే పొడవైన విండ్‌స్క్రీన్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే మంచి స్పోర్టియర్ స్టైలింగ్ డిజైన్‌ను కలిగిన ఈ మోటార్‌ బైక్ ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ తో అప్‌గ్రేడ్ చేయబడటం జరిగింది. అందుకే ఇది రోజువారీ రైడింగ్ కోసం కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: