ఇక ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ కార్ విభాగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) అని చెప్పాలి. ఈ కొరియన్ కార్ బ్రాండ్ అందిస్తున్న ఈ ఎస్‌యూవీ కార్ చాలా తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీని దక్కించుకోవడం జరిగింది. ఇది మంచి రోడ్ ప్రజెన్స్ ఇంకా ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిన్న కారు నుండి అప్‌గ్రేడ్ కోరుకునే వారు ఇంకా అలాగే మొదటి సారిగా సాలిడ్ ఎస్‌యూవీ కార్ ని కొనాలనుకునే వారు హ్యుందాయ్ క్రెటాను ఎంచుకుంటున్నారు.ఇక హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) కార్ మొత్తం ఆరు ట్రిమ్ లలో 1.5 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంకా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పలు వేరియంట్లలో లభించడం జరుగుతుంది.ఇక ఈ మోడల్ లో క్రెటా ఇ (Creta E) అనేది దాని బేస్ వేరియంట్ ఇంకా ఈ వేరియంట్ 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ ఇంకా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో ఈ కార్ లభిస్తుంది.ఇక హ్యుందాయ్ క్రెటా ఇ పెట్రోల్ కార్ ధర వచ్చేసి - రూ. 10.16 లక్షలు ఉంటుంది.ఇక హ్యుందాయ్ క్రెటా ఇ డీజిల్ కార్ వచ్చేసి - రూ. 10.62 లక్షలు ఉంటుంది.

ఇక పైన పేర్కొన్న ఈ రెండు కార్ల ధరలు వచ్చేసి ఎక్స్-షోరూమ్ కి సంబంధించినవి. ఇక ఈ వేరియంట్ కార్ ఓన్లీ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తాయి. ఈ కార్ లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనేది అందుబాటులో ఉండదు. ఇంకా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఫీచర్ కావాలనుకునే వారు మాత్రం మిడ్ లేదా టాప్ ఎండ్ వేరియంట్ల కార్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.ఇక హ్యుందాయ్ క్రెటా ఇ బేస్ వేరియంట్ వచ్చేసి రెండు ఇంజన్ ఆప్షన్లతో లభించడం జరుగుతుంది.ఈ కార్ లో మొదటిది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇంకా అలాగే రెండవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇక ఈ రెండు ఇంజన్లు కూడా ఓన్లీ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండటం జరుగుతుంది.ఇక ఈ ఎస్‌యూవీ కార్ లోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ ను అలాగే 143 న్యూటన్ మీటర్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక అలాగే, ఈ కార్ లోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ ను ఇంకా అలాగే 250 న్యూటన్ మీటర్ టార్క్ ను కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: