ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కోడా కంపెనీ  'కుషాక్' ఇప్పుడు 'మోంటే కార్లో ఎడిషన్‌'తో రాడానికి రెడీ అవుతుంది. ఇక ఇప్పటికే కంపెనీ 'స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్‌'పై పనిచేస్తున్నట్లు సమాచారం తెలిసింది. అయితే దీనికి సంబంధించిన మరి కొంత సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది.ఇక ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం స్కోడా కుషాక్ మోంటే కార్లో (Skoda Kushaq Monte Carlo) ఎడిషన్‌ను కంపెనీ 2022 మే 9 వ తేదీన మార్కెట్‌లో అధికారికంగా రిలీజ్ చేయనుంది. ఈ కొత్త మోడల్ ఇతర స్కోడా మోంటే కార్లో మోడల్‌ల లాగానే అద్భుతమైన డిజైన్ కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ ఇంకా అలాగే కాస్మెటిక్ అప్‌డేట్స్ ని కూడా పొందుతుంది.ఇక త్వరలో రానున్న స్కోడా కుషాక్ మోంటే కార్లో (Skoda Kushaq Monte Carlo) ఎడిషన్‌ రెడ్ ఇంకా అలాగే వైట్ ఎక్స్టీరియర్స్ డిజైన్ పొందుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఇది మునుపటి జనరేషన్ స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 లాగానే 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందే అవకాశం కూడా ఉంది.



ఇక అదే సమయంలో కుషాక్ మోంటే కార్లో ఫ్రంట్ ఫెండర్‌లపైన మోంటే కార్లో బ్యాడ్జింగ్స్ కూడా ఉంటాయి. అలాగే కుషాక్ మోంటే కార్లో ఇంటీరియర్స్ విషయానికి గనుక వస్తే, ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉపయోగించబడే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ తీసివేసే ఛాన్స్ ఉంటుంది.ఇక ఆ స్థానంలో స్కోడా స్లావియాలో వాడుతున్న కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెడ్ గ్రాఫిక్స్‌తో రానుంది.ఇక కుషాక్ మోంటే కార్లో అద్భుతమైన డిజైన్ ని పొందుతుంది. ఈ కార్ లో ఫుల్లీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్‌లు, హెడ్‌ల్యాంప్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అలాగే సబ్ వూఫర్‌తో కూడిన 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇంకా ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఇంకా అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి టాప్-స్పెక్ ఫీచర్స్ అనేవి కూడా ఉండనున్నాయి. ఇక ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: