ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల జోరు బాగా పెరుగుతోంది. ఎందుకంటే పెట్రోల్ ధరలు బాగా పెరగడంతో క్రమంగా అందరు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.దీంతో ప్రతి సంవత్సరం కూడా Ev మార్కెట్ బాగా పుంజుకుంటోంది. మరోవైపు ప్రజలను Ev వైపు మళ్లించడానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలని కూడా ఇస్తోంది. దీంతో ఇండియన్ ఈవి మార్కెట్ లోకి సరికొత్త టెక్నాలజీతో పలు ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే Ev ప్రియుల కోసం దేశీయ ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామి అయిన బజాజ్ కంపెనీ ఓ కొత్త సూపర్ స్కూటర్ అందుబాటులోకి తెచ్చింది.ఇప్పటీకే బజాజ్ ఆటో నుంచి పలు మోడళ్ల ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రాగా.. ఇప్పుడు మరో కొత్త వేరియెంట్‌ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు.


అయితే ఈ కొత్త మోడల్ గత ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే తక్కువ ధరకే లభిస్తోంది. బజాజ్ చేతక్ 2901 అనే ఈ కొత్త మోడల్ పసుపు, నీలం, ఎరుపు ఇంకా నలుపు రంగులలో లభ్యమవుతుందని బజాజ్ కంపెనీ తెలిపింది. దీని ఎక్స్-షోరూమ్ ధర విషయానికి వస్తే రూ.95,998 గా ఉంది.ఈ స్కూటర్ కలర్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎకానమీ ఇంకా అలాగే స్పోర్ట్స్ రైడింగ్ మోడ్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్-మ్యూజిక్ కంట్రోల్, హీల్ హోల్డ్ అసిస్ట్ ఇంకా రివర్స్ మోడ్ అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి. 2.88 kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తున్న ఈ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 123 కి.మీల దాకా పరుగులు పెడుతుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి మొత్తం 6 గంటల సమయం తీసుకుంటుంది.ఈ స్కూటర్ గరిష్ట వేగం వచ్చేసి గంటకు 63 కిమీ ఉంటుంది. జూన్ నెల నుంచి ఈ వాహనం యొక్క విక్రయాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం వేగంగా పుంజుకుంటున్న ఎలక్ట్రిక్ మార్కెట్ లో పలు దిగ్గజ కంపెనీలు బాగా పోటీ పడుతున్నాయి. ఎప్పటికప్పుడు తమ స్కూటర్లను అప్ గ్రేడ్ చేస్తూ మార్కెట్‌లో ప్రవేశ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: