కియా కారు ఇక షికారు కు సిద్ధమైంది.కియా కారు ఇక రోడ్ల పై పరుగులు తీయడానికి సిద్దంగా ఉంది. దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా పరిశ్రమ మేడిన్ ఇండియా పేరుతో తయారు చేసిన తొలి కారును గురువారం ప్రారంభించనున్నారు. కొత్త కంపెనీ కియా కార్ల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల వారు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి కంపెనీ ఏజెన్సీ తీసుకున్న వారు కూడా కార్ల కోసం ఆతృతతో ఉన్నారు.

గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కొత్త రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు కియా పరిశ్రమను తీసుకురావటం కోసం పెనుకొండ మండలంలో భూమి కేటాయించి అందుకు అనుగుణంగా గొల్లపల్లి రిజర్వాయర్ ను పూర్తి చేసి నీరందించారు. పెనుగొండ మండలం జాతీయ రహదారి వద్ద యర్రమంచి అమ్మవారుపల్లి మధ్య రైతుల ను ఒప్పించి భూములు ఇప్పించడంతో పరిశ్రమ సాధ్యమైంది.


ఈ కార్యక్రమానికి హాజరు కావలసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ లో బిజీగా ఉన్నందున పర్యటన రద్దయ్యింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కియా కార్ల పరిశ్రమతో అనంతపురం జిల్లాకు ప్రపంచంలో గుర్తింపు రానుంది. పెనుకొండ వద్ద రెండు వేల పదిహెడు ఆగస్టులో పనులు మొదలు పెట్టిన కియా రెండేళ్ల లో ఉత్పత్తి ప్రారంభించింది.


కియ తొలికారు అయిన  'సెల్టోస్'  మోడల్ ను మార్కెట్ లో ఇప్పటికే ఆవిష్కరించింది. జూలై పదహారు న బుకింగ్ కూడా ప్రారంభించింది. ఈ కారు వినియోగదారుల చేతికి ఈ నెల ఇరవై రెండున అందనుంది. దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఈ కార్లు ఎగుమతి కానున్నాయి. ఈ క్రమం లో జిల్లా కూడా అంతర్జాతీయ చిత్రపటంలోకి ఎక్కనుంది ఇప్పటికే హుండయ్ కార్ల తయారీ పరిశ్రమతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రపంచ గుర్తింపు పొందింది.



రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ప్రారంభమైన అతిపెద్ద కార్ల తయారీ పరిశ్రమ ఆచరణలోకి రావడం తో భారత దేశం నలుమూలల నుంచి వ్యాపారులు ఇక్కడి కి క్యూ కడుతున్నారు. ఇక మన ఆంధ్రా అభివృద్ధి మొదలవ్వబోతున్నదని మనకి తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: