టాటా నుండి వచ్చిన హ్యారియర్ బాగా క్లిక్ అయ్యింది. అయితే హ్యారియర్ లవర్స్ కోసం టాటా మోటార్స్ ప్రత్యేకంగా డార్క్ ఎడిషన్ ను లాంచ్ చేశారు. టాటా హ్యారియర్ 16.76 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఈ వెహికల్ అందుబాటులో ఉంది. టాటా హ్యారియర్ డార్క్ ఎడిషన్ మొత్తం బ్లాక్ షేడ్ తో ఎక్స్ టీరియర్ కలర్ తో వస్తుంది.   


2.0 లీటర్ కైరోటెక్ డీజిల్ ఇంజిన్ తో 140 బి.హెచ్.పి, 350 ఎన్.ఎం టార్క్ పవర్ తో 6 స్పీడ్ గేర్స్ తో ఈ వెహికల్ వస్తుంది. బిఎస్ 6 నామ్స్ తో వస్తున్న ఈ వెహికల్ 7 సీటర్ తో వస్తుంది. టాటా హ్యారిక రెగ్యులర్ మోడల్ కు ఈ స్పెషల్ ఎడిషన్ కు పెద్దగా చేంజెస్ ఏమి లేవని చెప్పొచ్చు. కాని కలర్ వేరియెంట్ లో మాత్రం డార్క్ ఎడిషన్ స్పెషల్ గా ఉండబోతుంది.      


టాటా హ్యారియర్ లాంచ్ అయిన నాటి నుండి సేల్స్ లో దూసుకెళ్తుంది. టాటా నుండి వచ్చిన వెహికల్స్ లో ఈమధ్య కాలంలో సక్సెస్ అయిన వెహికల్ హ్యారియర్ మరి ఈ స్పెషల్ డార్క్ ఎడిషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. తప్పకుండా టాటా సేల్స్ పెంచేలా ఈ వెహికల్ ఉంటుందని టాటా మోటార్స్ టీం చెబుతుంది. మరి అది ఎంతవరకు నిజమో సేల్స్ లో తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: