ఈ మధ్య కాలంలో దొంగల బెడద ఎక్కడ చుసిన చాలా ఎక్కువగా కనిపిస్తుంది . దొంగతనాలు చేసి అందిన కాడికి దోచుకుని ... విలాసవంతమైన జీవితాలను గడుపుతుంటారు. కానీ దొంగతనం చేస్తూ ఒక్కసారి పట్టుబడితే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టే ఉంటుంది దొంగల పరిస్థితి . ఇక్కడా ఓ దొంగకు అదే పరిస్థితి ఎదురైంది . ఓ గ్రామంలో వరుస దొంగతనాలు చేస్తూ పెద్ద బీభత్సమే సృష్టించారు ఆ దొంగలు . దీంతో  గ్రామస్థులు అప్రమతమవ్వటం తో దొంగల పరిస్థితి చావు అంచుల దాకా వెళ్ళొచ్చినట్టయ్యింది .


శ్రీకాకుళం జిల్లా సిగడాం మండలం మునిషివలసలో చాలా కాలంగా దొంగలు బీభత్సము సృష్టిస్తున్నారు . అందిన కాడికి దోచుకుంటూ...గ్రామస్థుల ఇళ్లను గుల్ల చేస్తున్నారు.దీంతో గ్రామస్థుల అందరు ఓ నిర్ణయానికి వచ్చారు...దొంగల బెడద తగ్గించాలని నిర్ణయించుకుని ... గ్రామస్తులంతా రాత్రి పూట  గస్తీ కాసేందుకు నిర్ణయించుకున్నారు . యువకులు  పెద్దలు  అంత చేతిలో కర్రలతో గ్రామంలోని అన్ని వీధుల గుండా గస్తీ కాస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇద్దరు దొంగలు వారికి ఎదురు పడగా ... వారిని పట్టుకునేందుకు  వెంటపడ్డారు. కానీ దొంగలు తప్పించుకొని పారిపోయారు  . కాగా ఆ దొంగలు గ్రామస్థుల నుండి తప్పించుకునేందుకు పారిపోతున్న నేపథ్యంలో ...అందులో ఓ దొంగా సమీప పొలాల్లో ఉన్న నీళ్లు లేని బావిలో పడిపోయాడు . దీంతో ఆ దొంగ నడుం విరిగిపోయింది . 


 నడుం విరిగిపోయి కదల్లేని స్థితిలో ఉన్న దొంగ ...36  గంటల పాటు తీవ్ర  నొప్పితో నరకం అనుభవించాడు . తర్వాత రోజు అటు వైపుగా వెళ్లిన గ్రామస్థులు బావి నుండి అరుపులు రావటం గమనించి ...పోలీసులకి సమాచారం అందించి ఆ వ్యక్తిని పైకి తీసుకువచ్చి  దొంగగా గుర్తించారు. మరో సారి దొంగతనాలకు పాల్పడొద్దని గట్టిగా హెచ్చరించి అతని కుటుంబీకులకు అతన్ని అప్పగించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: