మనం ఒకటి తలిస్తే విధి ఒక్కటి తలుస్తుంది అంటారు పెద్దలు . ఎదో చేయాలనీ మనం అనుకుంటే ... విధి మాత్రం ఇంకేదో చేస్తుంది  .ఈ ఘటనను చూస్తే ఇది నిజం అనిపిస్తుంది  .పెంపుడు కుక్కను కాపాడబోయి  ఇద్దరు  ప్రాణాలు కోల్పోయారు. ఇది వినటానికి వింతగా ఉన్న నిజంగా జరిగిన సంఘటన ఇది. 


వివరాల్లోకి వెళ్తే ...మహారాష్ట్ర లోని వార్దాలో   హిందూ నగర్ ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది . హిందూ నగర్ ఏరియాలో దంపతులు  సిద్ధార్థ, దీపాలి మశ్రామ్ లకు కొడుకులు రోహిత్ మశ్రామ్, ప్రవీణ్ మశ్రామ్ ఉన్నారు. కాగా  ఈ  కుటుంబం ...వారి ఇంట్లో ఓ కుక్క పిల్లను పెంచుకుంటుంది .కాగా ఓ రోజు కుక్కకి కరెంట్ షాక్ తగలగా దాన్ని కాపాడే క్రమంలో కుటుంబంలో పెను విషాదమే నెలకొంది .


 .కొడుకు రోహిత్ తన గదిలో బట్టలను ఐరన్ చేసుకుంటున్న క్రమంలో ... ఐరన్ బాక్స్ వైర్ ని ఎలుకలు కొరికిన విషయం గమనించలేదు . దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పెంపుడు కుక్క ఆ వైర్ ని తన బాడీకి చుట్టేసుకుంది . పెంపుడు కుక్కకి షాక్ తగలటం తో   కుక్కని కాపాడబోయి   కుక్కని వైర్ ని వేరు చేసే ప్రయత్నంలో రోహిత్ కుక్కని పట్టుకున్నాడు   దీంతో రోహిత్ కి కూడా కరెంట్ షాక్ తగిలింది . రోహిత్ అరుపులు విన్న తల్లి దీపాలి..తండ్రి సిద్దార్థ్ ఒకరి తర్వాత ఒకరు అక్కడికి చేరుకున్నారు . రోహిత్ కరెంట్ షాక్ తగలటం చుసిన వాళ్ళకి ...రోహిత్ ని కాపాడాలనే టెన్షన్ లో అతన్ని పట్టి లాగాలని ట్రై చేసారు దీంతో వాళ్లకి కూడా కరెంట్ షాక్ తగిలింది . 


కొద్దిసమయం తర్వాత అక్కడికి చేరుకున్న ప్రవీణ్ మశ్రామ్ కరెంట్ షాక్ తగిలి విలవిలాడుతున్న ముగ్గురిని చూసి పవర్ సప్లై ఆఫ్ చేసాడు .కాగా అప్పటికే ఆలస్యం అవ్వటం తో తల్లి దీపాలి... కొడుకు రోహిత్ మృతి చెందగా ... తండ్రి పరిస్థితి విషమంగా ఉంది . ఒక కుక్కను కాపాడబోయి  కుటుంబం లో ఇద్దరు  ప్రాణాలు కోల్పోవటం తో ఈ సంఘటన ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది


మరింత సమాచారం తెలుసుకోండి: