మీ ప్రయత్నం దేశానికి గర్వ కారణం
మీ అంకితభావం దేశ అభివృద్ధికి పునాది
మీ పట్టుదల దేశ ప్రజల కలలకు సాకారం
విశ్వం ముందు దేశం తలెత్తుకునేలా పనిచేసిన మీరు మాకు స్ఫూర్తి
నిద్రలేని రాత్రులు గడిపిన మహర్షులారా ... మీ ప్రయత్నానికి సలామ్ అంటోంది భారత దేశం. చంద్రయాన్ 2 ప్రయత్నం చివరలో ఆగిపోయినా... ఇస్రో శాస్త్రవేత్తలారా మీరు మైలు రాయిని అధిగమించినట్లే. 100 శాతం ప్రయత్నం చేసిన మీరు.... నిరాశ చెందాల్సిన పనిలేదు, ఆవేదన వ్యక్తం చేయాల్సిన అవసరం అంత కన్నా లేదు. దేశం గర్వించే ఎన్నో ప్రయోగాలు చేసిన మీరు... మా హృదయాల్లో ఎప్పుడు ఉన్నత స్థానాన్నే పొందుతారు. మీ సాహస యాత్ర మాలో ఎప్పుడు ఉత్తేజాన్ని నింపుతునే ఉంటుంది.


పగలు రాత్రి  తెగ లేకుండా తిండి తిప్పలు మాని రెండేళ్ల కష్టించి  ప్రతిష్టాత్మక చంద్రయాన్-2  ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు . జులై 22  ప్రతిష్టాత్మకంగా చంద్రుని  చెంతకు బయల్దేరిన చంద్రయాన్-2  ఎన్నో ఒడిదుడుకులను ఎగురుకుంటూ ఎన్నో అవాంతరాలు దాటు కుంటూ ...చంద్రుడిపై కాలు  మోపేందుకు సిద్దమైనది . భారతీయ దేశ కీర్తిని ప్రపంచ ఎల్లలకి  దాటించే ఈ ప్రయోగం విజయవంతం అయ్యేందుకు యావత్ భారతం ఎదురు చూసింది . కానీ చంద్రయాన్ -2  ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది . ఇంకా ఒకటే నిమిషంలో చంద్రయాన్-2  విజయం సాధిస్తుంది అనుకుంటున్నా సమయానికి ... చంద్రుడికి 2 .1  కిలో మీటర్ల దూరంలో ...రోవర్ నుండి ఇస్రో కి సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలే కాదు ...130  కోట్ల భారతీయులు ఆశలు అడియాశలయ్యాయి  . కానీ ఇస్రో ఓడిపోలేదు ... ఇప్పటి వరకు ఎవ్వరు  చేయలేని ఓ గొప్ప ప్రయత్నం తోనే గెలిచింది . చంద్రుడి దక్షిణ ధ్రువం పైకి జిఎస్ ఏల్వి ప్రయోగించి ఒక గొప్ప చరిత్రను సృష్టించి భారత్ విజయం సాధించింది .



మరింత సమాచారం తెలుసుకోండి: